గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు.. ఓపెన్ అయిన బాలీవుడ్ బ్యూటీ
Chitrangada Singh | చిత్రాంగద సింగ్.. అందమంతా కళ్లలోనే ఉంది. ఆ పెద్దపెద్ద కళ్ల వైపు ఓ నిమిషం చూస్తే చాలు. కైపెక్కిపోతుంది. రాజస్థానీ రాచకన్యల సోయగమంతా తనకే వచ్చేసినట్టుంది. అన్నట్టు, చిత్ర ప్రొడ్యూసర్‌గా మారింది. రచయిత్రి అనిపించుకుంది. తన జీవితంలోని ఒడిదుడుకులను ఇలా పంచుకుంటున్నది..

నిజమే. నాకూ కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో అవకాశాలు రాలేదని అతిగా ఆలోచిస్తూ కూర్చోకుండా దొరికిన సమయాన్ని ఇంకోరకంగా వినియోగించుకున్నా. ఆ ప్రయత్నంలోనే ఓ మంచి కథ రాశాను. నిర్మాతగా నేనే ఆ కథను తెరకెక్కిస్తున్నా. ఇప్పటి హీరోయిన్లు గ్లామర్ బాటపడుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కానీ నేనెప్పుడూ
గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు.

నా కెరీర్ మొదలై పదిహేడు సంవత్సరాలైంది. మిగతా హీరోయిన్లతో పోలిస్తే, నేను చేసిన సినిమాలు తక్కువే. అయితేనేం, ప్రతి పాత్రా సంతృప్తినిచ్చింది. పది గ్లామర్ సినిమాలు చేయడం కంటే, మనలోని ప్రతిభను వెలికితీసే ఒక్క సినిమా చేసినా చాలనుకుంటా. నా లక్ష్యం ఒక్కటే.. ప్రేక్షకుల మదిలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి.

మూస పాత్రలు నాకు ఇష్టం ఉండవు. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తా. అలాంటి పాత్రలకోసమే వేచి చూస్తా. అలాంటి కథలకు మాత్రమే ఓకే చెప్తా. మన దర్శకులు మంచిమంచి సినిమాలు తీస్తున్నారు. స్ఫూర్తివంతమైన కథలను ప్రేక్షకులు కూడా అలరిస్తున్నారు. గుండెల్ని తడిమే చిత్రాల కోసం నటీనటులు, దర్శకనిర్మాతలు ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటి ఓ కథ కోసం నేనూ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. త్వరలోనే నా పంచుల్ని తెరమీద చూస్తారు.

‘బాబ్ బిశ్వాస్’ సినిమాలో సంజయ్ ఘోష్‌తో పని చేయడం మరిచిపోలేని అనుభవం. నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇంత బిజీగా ఎప్పుడూ లేను. నిర్మాతగానూ వ్యవహరిస్తుండటంతో ఇంకొంత బిజీ అయ్యాను. వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, యాడ్స్, సినిమాలతో.. ప్రస్తుతం చేతినిండా పని ఉంది. ఈ ఏడాది తర్వాత పరిశ్రమలో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నా.

సినిమాల్లోకి రాకముందే నాకు పెండ్లయింది. కొన్నాళ్లకే విడిపోయాం. మాకు ఓ బాబు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్నా. సింగిల్ పేరెంట్‌గా బిడ్డ పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా. నేను వందశాతం పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పను కానీ, ఒకరికి క్షమాపణలు చెప్పుకొనే పనులు ఎన్నటికీ చేయను.
Read More:
Chitrangda Singh: కలర్‌ఫుల్ లెహంగాలో.. చిత్రాంగధ ధగధగలు”
“బాలీవుడ్‌కు చెమటలు పట్టిస్తున్న రష్మిక, సమంత”
“Samantha | రణ్‌వీర్‌సింగ్‌తో సమంత స్టిల్..సినిమా చేస్తున్నారా ఏంటీ..?”
“బాలీవుడ్ సినిమాలు, ఉత్తరాది ప్రేక్షకులపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

