పేరుకు టాలీవుడ్ హీరోయిన్స్ అయినా.. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్న చూపులన్నీ బాలీవుడ్ మీదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇక్కడి కంటే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. షూటింగ్స్‌లో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా వెంటనే ముంబై వెళ్లిపోతున్నారు ఈ ఇద్దరు హీరోయిన్లు. అంతే కాదు ఎక్కువగా హిందీ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తున్న కూడా.. వీళ్ల మనసు మొత్తం చలో ముంబై అంటుంది. అందుకే అక్కడి హీరోయిన్లకు పోటీ ఇవ్వాలంటే అందాల ప్రదర్శనలో ఏ మాత్రం వెనకడుగు వేయకూడదని.. గ్లామర్ షోలో మంటలు పుట్టిస్తున్నారు ఈ ఇద్దరు హీరోయిన్లు.
తాజాగా విడుదలైన వీళ్ల ఇద్దరి హాట్ ఫోటోషూట్ చూస్తే ఎవరికైనా చెమటలు పట్టడం ఖాయం. మరీ ముఖ్యంగా సమంత అయితే క్లీవేజ్ షోలో ఎప్పుడూ లేనంతగా రెచ్చిపోయింది. ఈమె రెచ్చిపోయిన విధానం చూసి బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక రష్మిక మందన్న కూడా తానేమీ తక్కువ తినలేదని నిరూపిస్తుంది. ప్రస్తుతం తెలుగు కంటే ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. దానికి తగ్గట్టుగానే గ్లామర్ షో కూడా చేస్తుంది. తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం రష్మిక చేసిన హాట్ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి సమంత, రష్మిక ఇద్దరు బాలీవుడ్‌కు తమ అందాలతో చెమటలు పట్టిస్తున్నారు.