బాలీవుడ్ సినిమాలు, ఉత్తరాది ప్రేక్షకులపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna | అదిరిపోయే హిట్లు. వరుస అవకాశాలు. కథను మలుపుతిప్పే పాత్రలు. దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే ఉత్తరాదిలోనూ సత్తా చాటుతున్నది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. చూపుల్లో అమాయకత్వం, కళ్లలో చిలిపిదనం కలబోసినట్టు ఉంటుంది మందస్మిత రష్మిక. తను మాట్లాడటం మొదలుపెడితే చాలు.. ఎన్నో విశేషాలు!

ఉత్తరాది ప్రేక్షకులకు దక్షిణాది సినిమాల పట్ల అభిమానం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేం కాదు. నేను బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వకముందే చాలామంది నన్ను గుర్తుపట్టి పలకరించారు. చాలా ఉత్తరాది రాష్ర్టాల్లో మన సినిమాలను టీవీల్లో ఎగబడి చూస్తారు. ఇప్పుడు ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ ఘన విజయంతో థియేటర్లకు వెళ్లి మరీ
చూస్తున్నారు. అంతే తేడా.

బాలీవుడ్లో అడుగు పెట్టిన తొలినాళ్లలోనే రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించడం అదృష్టమే. తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం. ఇక తెలుగులో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో నటించాను. కన్నడలో పునీత్ రాజ్ కుమార్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నా.
నా అభిమాన హీరోల లిస్ట్ చాలా పెద్దది. ఒకరిపేరని ఎలా చెప్పను? అదృష్టం కొద్దీ అవకాశాలతోపాటు మంచి కథలు కూడా వస్తున్నాయి.

టాలీవుడ్లో చేస్తూనే బాలీవుడ్ పైనా ఫోకస్ చేస్తున్నా. అమితాబ్ బచ్చన్‌తో పనిచేస్తున్నంత సేపూ ఆయన నుంచి ఏం నేర్చుకోగలనా అనే ఆలోచిస్తాను. ఏమాత్రం గ్యాప్ దొరికినా పెద్దాయన జీవితానుభవాలు తెలుసుకుంటాను. నటనలో సందేహాలు తీర్చుకుంటాను. నా దృష్టిలో ఆయన ఓ విజ్ఙాన ఖని. సినిమాకు సంతకం చేసేముందు కథ, నా పాత్ర ప్రాధాన్యం..
ఇంత వరకే ఆలోచిస్తాను. ఆ సినిమా పూర్తయ్యేవరకూ పాత్రకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తాను. పెద్దపెద్ద హీరోలు కూడా తమనుతాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల ముందు నేనెంత?

దక్షిణాది, ఉత్తరాది అనే తేడా నాకెప్పుడూ లేదు. దేశమంతా నా గురించి తెలియాలి. అభిమానులను నేను మరింత అలరించాలి. పాన్ ఇండియా సినిమాలతో నా లక్ష్యం సులభమైంది. అందరూ అన్ని సినిమాలూ చూస్తున్నారు. తేడా లేకుండా ఆదరిస్తున్నారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమానం పొందడం ఆనందంగా ఉంది.
Read More :
“Rashmika Mandanna | స్లీవ్ లెస్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో రష్మిక మందన్న పరువాలు..”
Rashmika Mandanna | ఇదే మంచి తరుణం అనుకుంటున్నా..!”
“Rashmika Mandanna | హై పిచ్‌లో స్టార్ డమ్..ఈ కన్నడ భామకే సొంతం..!”
“Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

