Rashmika Mandanna | హై పిచ్‌లో స్టార్ డమ్..ఈ కన్నడ భామకే సొంతం..!
ఇటీవలే పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో మెరిసి మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. తక్కువ టైంలోనే అందరితో నేషనల్ క్రష్ (Nation’s Crush)అని పిలిపించుకుంటోంది రష్మిక మందన్నా (Rashmika Mandanna).
ఇపుడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ దర్శకనిర్మాతలు ఎక్కువగా జపిస్తున్న పేరు రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇటీవలే పుష్ప సినిమాలో శ్రీవల్లిగా డీగ్లామరైజ్డ్ పాత్రలో మెరిసి మంచి మార్కులు కొట్టేసింది రష్మిక. తక్కువ టైంలోనే అందరితో నేషనల్ క్రష్ (Nation’s Crush)అని పిలిపించుకుంటోంది. కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దేశంలోని వివిధ సూపర్ స్టార్ల తో నటించే ఛాన్స్ కొట్టేసిన ఒకే ఒక్క హీరోయిన్ రష్మిక అంటే అతిశయోక్తి కాదేమో.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun)తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది రష్మిక. మరోవైపు బన్నీతో రెండోసారి పుష్ప 2లో మెరిసేందుకు ముస్తాబవుతోంది. అంతేకాదు ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఫైనల్ అయినట్టు టాక్. రాంచరణ్-గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా మెరువబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తమిళ భాషలో కూడా దళపతి విజయ్ (Thalapathy 66) తో కలిసి 66వ చిత్రంలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్‌గా చెన్నైలో లాంఛ్ అయింది. అంతేకాదు హిందీలో కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బై (Goodbye) సినిమాలో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ (Animal) లో హీరోయిన్గా నటిస్తోంది.
సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను త్వరలోనే థియేటర్లలో సందడి చేయేందుకు రెడీ అవుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండియావైడ్‌గా స్టార్ హీరోలతో నటిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌ను సాగిస్తూ..ఆల్ టైమ్ హై పిచ్‌లో స్టార్ డమ్ మెయింటైన్ చేస్తోంది రష్మిక. రష్మిక నటించిన సినిమాలు దాదాపు సక్సెస్ సాధించినవే.
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Niharika Konidela | నిహారిక బ్యాక్ టు సోషల్ మీడియా..ఈ గ్యాప్‌లో 3 పాఠాలు నేర్చుకుందట
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

