ముంబై: వెడ్డింగ్ సీజన్ వేళ కొత్త కొత్త డ్రెస్సులు అలరిస్తుంటాయి. చీరలు కామన్ అయినా.. కలర్ఫుల్గా కనిపించే లెహంగాలు కొంత ఆకట్టుకుంటాయి. ఇక వెడ్డింగ్ వోస్ మ్యాగ్జిన్ కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. దాంట్లో బాలీవుడ్ నటి చిత్రాంగధ సింగ్ ( Chitrangda Singh ) చాలా గ్రాండ్‌గా దర్శనమిచ్చింది. వెలుగులు చిమ్ముతున్న లెహంగాలో.. చిత్రాంగధ చాలా సూపర్బ్‌గా ఉంది. పెళ్లి వేళ లేటెస్ట్ ట్రెండింగ్ దుస్తులు వేసుకోవడం సహజం. ఇక చిత్రాంగధ కూడా అలాంటి లెహంగాలోనే అట్రాక్ట్ చేస్తోంది. మల్టీకలర్స్లో ఉన్న లెహంగాతో చిత్రాంగధ మరింత రమణీయంగా ఉంది. ఆమె వేసుకున్నది సాహిల్ కొచ్చార్ లెహంగా. స్టీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఆ లెహంగాలో లుక్కిచ్చింది. రాబోయే వెడ్డింగ్, ఫెస్టివ్ సీజన్‌కు చిత్రాంగధ లెహంగా ఓ కొత్త ట్రెండ్ కానున్నది.