కాజల్, రకుల్, అల్లు అర్జున్ సహా టాప్ సెలబ్రెటీలకు ఈయనే మేకప్ ఆర్టిస్ట్.. ఎవరో తెలుసా
Makeup Artist Sandeep Molugu | మేకప్.. సహజ సౌందర్యానికి అదనపు హంగులు అద్దుతుంది. బోర్డ్ మీటింగ్‌లు, కుటుంబ వేడుకలు, విందులు, పెండ్లి కార్యక్రమాలు.. ఎక్కడికి వెళ్లాలన్నా నగర జీవులకు మేకప్ తప్పనిసరి. సినీ తారలకు సరేసరి. కార్పొరేట్ వరల్డ్ నుంచి గ్లామర్ ప్రపంచం వరకు.. ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో హైదరాబాదీ మేకప్ ఆర్టిస్ట్ సందీప్ అపాయింట్మెంట్ తీసుకున్నవారే.

Makeup Artist Sandeep Molugu ( Sandy Artist )
‘శాండీ ఆర్టిస్ట్ ( Sandy Artist )’గా సుపరిచితుడైన సందీప్ మేకప్ మాంత్రికుడు. ఈ రంగంలోకి రావడానికి ముందు చాలా కొలువులే చేశాడు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, యాక్సెంట్ ట్రైనర్, కొరియోగ్రాఫర్, యాక్టర్ ఇలా. ఫ్యాషన్‌పై ఆసక్తితో తన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాడు. చదువుకునే రోజుల నుంచే సందీప్ సృజనాత్మకంగా ఆలోచించేవాడు. ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగానే ఉండాలని తపించేవాడు. చేతలు సైతం స్మార్ట్‌గా, స్టయిలిష్‌గా ఉండేవి. ఆ భిన్నమైన వ్యక్తిత్వమే సందీప్‌ను ఫ్యాషన్ ప్రపంచంవైపు అడుగులు వేయించింది. మేకప్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలన్న సంకల్పం కలిగించింది. మేకప్ దిగ్గజం మాస్ట్రో ముస్తఫా దగ్గర హెయిర్ స్టయిలింగ్‌లో శిక్షణ తీసుకొని అబుదాబీ వెళ్లాడు సందీప్. అక్కడ చార్బెల్ రిజ్క్ దగ్గర మేకప్, స్టయిలింగ్‌లో పాఠాలు నేర్చుకున్నాడు. కొంతకాలానికి ఓ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి ‘ఐ యామ్’ సినిమాకు పనిచేశాడు. అలా శాండీ మేకప్ కెరీర్ ప్రారంభమైంది. ఒకటి తర్వాత ఒకటి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. స్వతంత్రంగా ఈవెంట్స్ నిర్వహించే స్థాయికి ఎదిగాడు.

Makeup Artist Sandeep Molugu ( Sandy Artist )
ఫేవరెట్ అయ్యాడు
2011లో ‘మిస్ హైదరాబాద్’ అందాల పోటీలకు పనిచేశాడు సందీప్. అప్పట్నుంచి ‘మిస్ హైదరాబాద్’ జ్యూరీ మెంబర్‌గానూ ఉంటున్నాడు. ఫ్యాషన్ రంగంలో రాణించాలన్న కోరికతో సందీప్ మొదటిసారిగా కరణ్ జోహార్‌తో కలిసి ‘తాజ్ ఖజానా’ ఆర్గనైజ్ చేసిన ఫ్యాషన్ షోకు మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించాడు. అలా సెలెబ్రిటీ సర్కిల్స్‌లో సందీప్ గురించి చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా సినిమా వాళ్లకు.. మరీ ముఖ్యంగా దక్షిణ భారత సినీ సెలెబ్రిటీలకు ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్ కాగలిగాడు. ఉపాసన కామినేని, పీవీ సింధు, సానియా మీర్జా, గుత్తా జ్వాల వంటి భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు మేకప్ మెరుగులు అద్దాడు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా ద్వారా సోలో మేకప్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు సందీప్. బాలీవుడ్ సూపర్స్టార్లు సైతం ‘మేకప్ గురు’గా భావించే స్థాయికి చేరుకున్నాడు. సబ్యసాచి, నీతా లుల్లా, మనీశ్ మల్హోత్రా, తరుణ్ తహిలియానీ, శ్రవణ్‌కుమార్, అస్మితా మార్వా, స్వప్నిల్ షిండే, శంతను, నిఖిల్ మొదలైన డిజైనర్లకు పనిచేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లక్ష్మీ మంచు, తాప్సీ పన్ను, ప్రియా ఆనంద్, రెజీనా కసాండ్రా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథెరిన్ థెరీసా, రామ్‌చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి టాప్ సెలెబ్రిటీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. సందీప్‌తో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తారు చాలామంది మోడల్స్. మిస్ వరల్డ్- 2017 మానుషి చిల్లర్‌కు కూడా తనే మేకప్ ఆర్టిస్.్ట గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్లోనూ మానుషితో కలిసి పనిచేశాడు. ప్రముఖ మోడల్స్ కూడా సందీప్ మేకప్‌ను ఇష్టపడతారు. వోగ్, ఫెమీనా, యు అండ్ ఐ, సావీ తదితర పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తాడు సందీప్. ‘అలంకరణను ఇష్టపడే అమ్మాయిలకు నా సలహా ఒక్కటే. రసాయన ఉత్పత్తులతో మీ చర్మాన్ని నాశనం చేసుకోకండి. వంటింటి చిట్కాలే సురక్షితం. అమ్మను మించిన బ్యుటీషియన్ ఎక్కడా లేరు’ అంటాడు సందీప్.

Makeup Artist Sandeep Molugu
* ‘ఐ యామ్’ సినిమాకు అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్.
* ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ సినిమాకు ప్రియా ఆనంద్ మేకప్ ఆర్టిస్ట్.
* శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్.
* ‘మహంతి’ సినిమాలో ఒక సాంగ్ కోసం పనిచేస్తున్నాడు.
Read More :
సెలబ్రెటీలు తమ పిల్లలకు డిఫరెంట్‌గా పేర్లు ఎందుకు పెడుతున్నరు.. రీజనేంటి?
నాటు నాటు సాంగ్‌కు చరణ్, తారక్‌తో అదిరిపోయే స్టెప్పులు వేయించింది ఈయనే
సమంత, అఖిల్ ఫిట్నెస్ వెనుక ఉన్నది ఇతనే.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన శిష్యులే
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు స్టార్టప్స్.. సైడ్ బిజినెస్‌లతో దూసుకెళ్తున్న టాలీవుడ్ స్టార్స్..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

