సెలబ్రెటీలు తమ పిల్లలకు డిఫరెంట్‌గా పేర్లు ఎందుకు పెడుతున్నరు.. రీజనేంటి?
Celebrity Children’s Names | టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సెలెబ్రిటీల పిల్లల పేర్లలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది. కొందరు ‘వైవిధ్యమైన’ పేర్లను ఎంచుకుంటే, మరికొందరు ‘ప్రకృతి’ నుంచి ప్రేరణ పొందారు. తాతముత్తాతల పేర్లను జోడించినవారు కొందరైతే.. కృతజ్ఞతకొద్దీ పరిశ్రమ పెద్దల నామధేయాలను ఇమిడ్చినవారు ఇంకొందరు.

రామ్ చరణ్.. ‘చరణ్ తేజ్’గా ‘చిరుత’ చిత్రంతో తెరంగేట్రం చేశాక.. ఎటు చూసినా ఆ పేరే వినిపించింది. చాలా పేర్ల పక్కన ‘తేజ్’ చేరింది. ఇక, బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ‘దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’లో షారుక్ పాత్ర పేరు రాజ్ మల్హోత్రా. ఈ సినిమా తర్వాత చాలామంది తమ పిల్లల పేర్ల పక్కన ‘రాజ్’ జోడించడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్- అన్నా లెజ్నెవా జంటకు ఇద్దరు పిల్లలు. కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలినా అంజనా పవనోవా. ‘మార్కస్’ అనేది ఐరోపా పేరు. ఇది రోమన్ దేవుడు ‘మార్స్’ నుంచి ఉద్భవించింది. చిరంజీవిలోని ‘శివశంకర వరప్రసాద్’ నుంచి ‘శంకర్’ను తీసుకున్నారు. పవన్ కల్యాణ్లోంచి ‘పవనోవిచ్’ చేర్చారు. కూతురు పేరులోని ‘పోలినా’ రష్యన్ పదం. ‘అపోలి నారియా’ అనే కవి పేరు నుంచి తీసుకున్నారు. మెగా బ్రదర్స్ తల్లి పేరులోంచి ‘అంజన’ను జోడించారు. అన్నిటికంటే గొప్ప విషయం ఇది.

గుర్తు..
మంచు విష్ణు-విరోనికా దంపతులకు మొదట అరియాన, వివియాన అనే కవలలు పుట్టారు. తర్వాతి కాన్పులో అబ్బాయి జన్మించాడు. ఆ బిడ్డకు ‘అవ్రామ్ భక్త’గా నామకరణం చేశారు. ‘అవ్రామ్’ అంటే ‘ఎవరూ ఆపలేరు’ అని అర్థం. చివరన ‘భక్త’ చేర్చారు (మోహన్‌బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు). ఆ తర్వాత కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ‘ఐరా విద్య’ అని పేరు పెట్టారు. మోహన్‌బాబు శ్రీ విద్యానికేతన్ ఎడ్యు కేషనల్ ట్రస్ట్లోంచి ‘విద్య’ను తీసుకున్నారు.

పరంపర..
నందమూరి కుటుంబం విషయానికొస్తే.. ఎన్టీఆర్ తన తనయుల పేరు చివర కృష్ణ, కూతుళ్ల పేర్ల చివర ఈశ్వరి జోడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తన ఇద్దరు కుమారుల పేర్ల చివరన రామ్ వచ్చేలా ప్లాన్ చేశాడు. పెద్ద ఎన్టీఆర్ ‘కృష్ణ’తో ట్రెండ్ సెట్‌చేస్తే, చిన్న ఎన్టీఆర్ ‘రామ్’తో మరో ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాడు.

స్మరణ..
అల్లరి నరేష్, విరూప దంపతుల కూతురి పేరులోనూ అందమైన మేళవింపు ఉంది. నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఈవీవీ అనేది ఒక బ్రాండ్‌గా మారింది. దీంతో నాన్న పేరు కలిసొచ్చేలా కూతురికి ‘ఇవికా’ అని నామకరణం చేశారు నరేష్. దానికి ‘అయాన’ చేర్చి అయాన ఇవికగా స్థిరపరిచారు. చివర్లో ఇంటిపేరు ‘ఈదర’నూ జోడించారు. హీరో గోపీచంద్ తన కొడుక్కి విరాట్ కృష్ణ అని పేరు పెట్టాడు. ‘విరాట్’కు తన నాన్న పేరు అయిన ‘కృష్ణ’ చేర్చాడు. దివంగత టి.కృష్ణ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కృతజ్ఞత..
కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పేరు నీల్. కాజల్‌కు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. మానవ జీవితాలు ప్రకృతి పెట్టిన భిక్ష అని నమ్ముతుంది తను. ఇంత ఇచ్చిన ప్రకృతికి కృతజ్ఞతగా తన కొడుకు పేరును ‘నీల్’గా నామకరణం చేసింది. కమెడియన్ ధన్‌రాజ్ అయితే.. దర్శకుడు సుకుమార్, హీరో రామ్‌ల పట్ల కృతజ్ఞతకొద్దీ తన తనయుడికి ‘సుక్కురామ్’ అని పేరు పెట్టుకున్నాడు.

సన్నీలియోన్, డానియల్ వెబర్ కూడా తమ పిల్లలకు మూలాలు గుర్తుండేలా పేర్లు పెట్టారు. హృతిక్ రోషన్ తన ఇద్దరు కుమారులకు అరబిక్ పేర్లు ఎంచుకున్నారు. సెలెబ్రిటీలు ఏం చేస్తే.. అభిమానులూ అదే చేస్తారు. ఆ ప్రభావం పిల్లల పేర్ల డిక్షనరీని కూడా ప్రభావితం చేసున్నది. దీంతో కొత్తకొత్త పేర్లు ప్రచారంలోకి వస్తాయి. అదనంగా.. పాత పేర్లే కొత్తగా మేకోవర్ చేసుకుంటాయి.
Read More :
శ్రీదేవి మరణం తర్వాత లైఫ్‌లో వచ్చిన మార్పులపై ఓపెన్ అయిన జాన్వీ కపూర్
Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..
Aditi Rao Hydari | ముంబైలోని అదితీరావ్ హైదరీ నివాసం ఎంత బాగుంటుందో తెలుసా!!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- celebrities
- names
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

