శ్రీదేవి మరణం తర్వాత లైఫ్‌లో వచ్చిన మార్పులపై ఓపెన్ అయిన జాన్వీ కపూర్
Janhvi Kapoor | అమ్మ నుంచి అందాన్ని, అభినయాన్ని వారసత్వంగా పొందింది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్. తెరంగేట్రం చేసి నాలుగేండ్లవుతున్నా ఆచితూచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకుంది. ‘ధడక్’తో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టిన జాన్వీ.. వరుసగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్ని పోషిస్తూ తనలోని సీరియస్ యాంగిల్తోనూ ఆకట్టుకుంటున్నది. తల్లి శ్రీదేవి మరణానంతరం తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి జాన్వీ పంచుకున్న ముచ్చట్లు..

ఆ మూడూ ఇష్టం..
నాకు బాగా నచ్చే విషయాలు మూడు. తినడం, తిరగడం, నటించడం. నచ్చిన ఆహారాన్ని కడుపునిండా తింటా. అదే సమయంలో శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి సరైన వ్యాయామం చేస్తా. ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. ఏమాత్రం అవకాశం దొరికినా ఏదో ఒక ప్రదేశానికి వెళ్లిపోతా. ‘జాహ్నవి’ అంటే ‘కల్మషం లేనిది’ అని అర్థం. ఆ అర్థం తెలుసుకుని మరీ అమ్మానాన్న నాకు ఈ పేరు పెట్టారు. ఆ నమ్మకానికి భంగం కలగకుండా చూసుకుంటా.

చాలా కష్టం..
నటిగా అందరినీ అలరించడం సంతోషాన్ని ఇచ్చే విషయమే. కానీ, ఒక సెలబ్రిటీగా నలుగురి మధ్య మెలగడం మాత్రం చాలా కష్టం. అందరి కండ్లూ మాపైనే ఉంటాయి. ఎక్కడి
కెళ్లినా, ఏం చేసినా రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి. సెలబ్రిటీ అయినా, మామూలు వ్యక్తి అయినా.. ఎవరి జీవితం వారిదే. మాకూ కొంత ప్రైవసీ కావాలి. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో చాలా రకాలుగా ట్రోలింగ్ చేస్తారు. అయినా నేను పట్టించుకోను. మనం ఏం చేస్తున్నామన్నది మనకు తెలిస్తే చాలు.

అమ్మ కోసం
అమ్మ చనిపోయేంత వరకు నాకు, చెల్లి ఖుషీకి బయటి ప్రపంచం పెద్దగా తెలీదు. చదువులు, ఇష్టాలు, అభిరుచులు.. వీటిమీదే మా దృష్టంతా. ఆ తర్వాతే సమాజం అంటే ఏంటో తెలిసొచ్చింది. నేను సినిమాల్లోకి రావాలన్నది అమ్మ కోరిక. అందుకే ‘ధడక్’తో నా ప్రయాణం ప్రారంభించా.

నాన్నే నా బెస్ట్ ఫ్రెండ్
అమ్మ చనిపోయాక నాన్న(బోనీ కపూర్) మాకు చాలా దగ్గరయ్యారు. మా పూర్తి బాధ్యతలు ఆయనకు కొత్తే అయినా, ఎంతో చక్కగా మమ్మల్ని చూసుకున్నారు. చిన్నప్పటినుంచీ నాకు నాన్నంటే ప్రత్యేక అభిమానం. ఇంట్లో నాన్న, నేను ఒక జట్టు. ప్రతి విషయాన్నీ నాన్నతోనే షేర్ చేసుకుంటా. నాన్నే నా బెస్ట్‌ఫ్రెండ్.
అదృష్టంగా భావిస్తా..
అమ్మ చనిపోయాక అర్జున్ భాయ్, అన్షులా దీదీ మమ్మల్ని తమ చెల్లెళ్లుగా ఒప్పుకొని, మా జీవితంలోకి రావడం నిజంగా మా అదృష్టం. అర్జున్ వల్ల తెలియని ధైర్యం వచ్చింది. తను మమ్మల్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటాడు. ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నాడు. ఓ అన్నయ్య అండను మించిన బలం ఏం ఉంటుంది?

వచ్చినదాంట్లో నచ్చినవి..
‘ధడక్’ తర్వాత మంచి రొమాంటిక్ సినిమాల్లో చేయాలనుకున్నా. కానీ, ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలే వచ్చాయి. వచ్చినవాటిలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నా. నాకు స్త్రీవాద భావాలు ఎక్కువ. చాలా దేశాల్లో ఇప్పటికీ స్త్రీల పట్ల వివక్ష ఉంది. ‘గుంజన్ సక్సేనా’, ‘రుహి మిలి’, ‘గుడ్‌లక్ జెర్రీ’ సినిమాలు అభిమానులను అలరిస్తూనే మంచి సందేశాన్ని ఇచ్చాయి. మళ్లీ ఇటువంటి కథలే చేయాలని లేదు. ముందుముందు రొమాంటిక్ డ్రామాల్లో చేయాలనుకుంటున్నా. కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. రెండేండ్ల కాలం ఎంతో నేర్పింది.
Read More :
Janhvi Kapoor | ఆరంజ్ కలర్ డ్రెస్‌లో సొగసులు ఒలకబోసిన జాన్వీ కపూర్..”
Janhvi Kapoor | ‘నేను సంతకం చేస్తే చెప్తా’..విజయ్ సినిమాపై జాన్వీకపూర్”
“Janhvi Kapoor | జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందా..?”
“Janhvi Kapoor | మత్తెక్కించే పోజులతో మైండ్‌బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్..”
Janhvi Kapoor | హాట్ హాట్‌గా జాన్వీ కపూర్ అందాల ఆరబోత..వీడియో వైరల్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం


