Janhvi Kapoor | జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందా..?
Janhvi Kapoor Tollywood Entry | అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీ కపూర్‌కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది.. ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఈమెను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. శ్రీదేవి ఉన్నపుడు కూడా తన కూతురు తనలా సౌత్‌లో పేరు తెచ్చుకున్నపుడే ఆనందంగా ఉంటానని చెప్పింది. అయితే ఆమె చనిపోవడంతో అమ్మ కోరిక తీర్చలేకపోయింది జాన్వీ కపూర్. కానీ తప్పకుండా తాను కూడా సౌత్ సినిమాల్లో నటిస్తానని చాలా రోజుల నుంచి చెప్తుంది జాన్వీ. మొన్న ఓ సినిమా వేడుకలో బోనీ కపూర్ కూడా ఇదే చెప్పాడు. తన కూతురు జాన్వీ కపూర్ అన్ని సౌత్ సినిమాలలో నటిస్తుందని చెప్పుకొచ్చాడు ఈయన. కానీ సరైన కథ కావాలని చెప్పాడు.
ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. దాంతో పాటు ట్రిపుల్ ఆర్‌లో కూడా జాన్వీ నటిస్తుందనే వార్తలొచ్చినా అది నిజం కాలేదు. కానీ ఇప్పుడు శ్రీదేవి కూతురు టాలీవుడ్ వైపు వస్తుందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అయితే ఈమె వచ్చే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే చాలా ఏండ్లుగా జాన్వీని తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ అది జరగలేదు. ఈ మధ్యే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈమెను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో జాన్వీ నటించబోతుందనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో కూడా ఎలాంటి నిజం లేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో హీరో పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అఖిల్ అక్కినేని సినిమాతో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానుందనే ప్రచారం జరుగుతుంది.
ఏజెంట్ తర్వాత అఖిల్ ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. కచ్చితంగా తెలుగులో ఇదే జాన్వీకి తొలి సినిమా అయ్యేలా కనిపిస్తుంది.
Read More :
“Janhvi Kapoor | చీరకట్టులో తళుక్కుమన్న అందాల జాన్వీ..”
“Janhvi Kapoor | సాగర తీరంలో జాన్వీ కపూర్ సొగసులు..”
“Janhvi Kapoor | వయ్యారాలతో కవ్విస్తున్న జాన్వీ కపూర్..”
“Janhvi Kapoor | బికినీలో జాన్వీ కపూర్ జలకాలాటలు..”
Janhvi Kapoor | వైట్ డ్రెస్‌లో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

