Aditi Rao Hydari | ముంబైలోని అదితీరావ్ హైదరీ నివాసం ఎంత బాగుంటుందో తెలుసా!!
Aditi Rao Hydari | సొంతిల్లు సొంతిల్లే! గడపలో కాలుపెట్టగానే అమ్మ పొత్తిళ్లలో సేదతీరుతున్న భావన. మనదైన ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న భరోసా. గోడ, తలుపు, కిటికీ.. ప్రతిమూలతోనూ అమూల్యమైన అనుబంధం. ఆ రంగులు మనం ఎంచుకున్నవే, ఆ కర్టెన్లు మన అభిరుచికి అద్దం పట్టేవే. ఆ పెయింటింగ్స్ మనం ప్రేమకొద్దీ అలంకరించినవే. ఆ మొక్కలన్నీ మనం నీళ్లుపోసి పెంచినవే. ఎవరి ఇల్లు వారికి స్వర్గమే. సినీతార అదితీరావ్ హైదరీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఆమె గడసరి. మాటల్లో పొదుపరి. సినిమాలు, పాత్రలు, డైరెక్టర్లు, హీరోలు.. ఎవరి గురించి ప్రశ్నించినా ‘అవును’, ‘నిజమే’, ‘ఇట్స్ అమేజింగ్’.. అంటూ ముక్తసరిగానే జవాబిస్తుంది. కానీ, తన ఇంటి ప్రస్తావన రాగానే.. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘ఏషియన్ పెయింట్స్ వేర్ ద హార్ట్ ఈజ్’ కార్యక్రమంలో భాగంగా ముంబైలోని అదితీరావ్ హైదరీ నివాసాన్ని వీడియో చేసింది. అందులో అనేక విషయాలు ముచ్చటించింది. ఆ కబుర్లన్నీ ఆమె మాటల్లోనే..

“నా ఇల్లు.. నేను పక్షినైతే ఓ చిన్నగూడు. నేను మహాసామ్రాజ్ఞినైతే.. ఓ పెద్ద అంతఃపురం. పెద్దదైనా, చిన్నదైనా ఇల్లు ఇల్లే. ఈ ఇంట్లోని అణువణువూ నాకు సుపరిచితమే. షూటింగ్ నుంచి అలసిసొలసి వచ్చినప్పుడు.. నా ఇల్లు నన్ను చిరునవ్వుతో స్వాగతిస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు అమ్మలా, కొన్నిసార్లు నాన్నలా, కొన్నిసార్లు స్నేహితురాలిలా కనిపిస్తుంది. ఈ ఇంట్లోని లివింగ్ రూమ్ నాకెంతో ఇష్టం. ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతాను. నేను దర్జాగా కూర్చునే ఈ సోఫా.. నూటికి నూరుపాళ్లూ నా ఎంపికే. ఈ బుజ్జిముండ కోసం ఎన్ని షోరూమ్‌లు తిరిగానూ! ఇంటర్నెట్లో ఎన్ని నిద్రలేని రాత్రులు సెర్చ్ చేశానూ! అదిగో ఆ కుషన్ల కోసమైతే నాలోని క్రియేటివిటీని మొత్తం ధారపోయాల్సి వచ్చింది. డిజైనర్ అవతారం ఎత్తాను.

తెల్లని తెలుపు
తెలుపు.. నాకు నచ్చిన రంగు. తెల్ల చీర.. నాకు ఇష్టమైన ఆహార్యం. తెల్ల గులాబీ.. నా అభిమాన పుష్పం. తెలుపు, తెలుపు, తెలుపు.. నా చుట్టూ ఓ శ్వేత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని నా కోరిక. అందులో భాగంగానే నా ఇంటికి తెల్లటి తెలుపు రంగు వేయించాను. ఆ గోడల మీద చిన్న మచ్చపడినా మనసు విలవిలలాడిపోతుంది. ఆ తెల్లని గోడమీద రంగురంగుల పెయింటింగ్స్! నా దగ్గర ప్రముఖ చిత్రకారుల కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ప్రతీకాత్మక చిత్రాలంటే నాకు ఇష్టం. ఎంత ధర పెట్టడానికైనా సిద్ధం. కొన్నిసార్లు వేలంపాటలోనూ సొంతం చేసుకుంటాను. మనం మహారాజా ప్యాలెస్‌లో ఉంటున్నా సరే.. పుట్టిపెరిగిన ఇంటి మీద మమకారం ఎక్కడికీ పోదు. హైదరాబాద్‌లోని మా ఇల్లు ఇప్పటికీ నా కలలోకి వస్తూ ఉంటుంది. కాబట్టే, నా ముంబై ఫ్లాట్‌ను అలానే డిజైన్ చేయించాను.

అమ్మలాగే సర్దుకుంటా..
“ఈ ఇంట్లో కిటికీలు చాలా ఎక్కువ. అందుకే నాకు మరింత ఇష్టం. వెలుతురు ఎక్కువగా రావడంవల్లే ఇంట్లో ఒకరమైన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. నాకే కాదు, నా స్నేహితులకూ ఈ ఇల్లంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా తమ సొంతింటిలానే అనుకుంటారు. ప్రత్యేకించి డైనింగ్ హాల్ గురించి చెప్పుకోవాలి. ఇంటికొచ్చిన అతిథులకు భోజనం వడ్డించడం నాకెంతో ఇష్టమైన పని. ఒక్కోసారి అవతలి వాళ్లకు ఆకలిగా లేకపోయినా, బలవంతంగా వడ్డించేస్తుంటా. ఇంటిని అందంగా సర్దుకోవడం నాకు ముందు నుంచీ అలవాటు. ఓ పద్ధతిగా, కళాత్మకంగా సర్దడంలో అమ్మే నా గురువు. ఈ ఇంట్లో బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది. బాల్కనీ కూడా గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడ చిన్నచిన్న మొక్కలను పెంచుతున్నా. బాల్కనీలోని మొక్కలకు నీళ్లు పోయడం, సాయంత్రాలు ఆకాశాన్ని చూస్తూ కాఫీ తాగడం బాగా ఇష్టమైన వ్యాపకాలు. కొన్నిసార్లు నా ఇల్లు బొమ్మరిల్లులానూ అనిపిస్తుంది”.
Read More :
“Aditi Rao Hydari | అదితి రావు అదిరిపోయే ఫొటో షూట్..”
Aditi Rao Hydari | పింక్ డ్రెస్‌లో అదితి రావు స్టిల్స్..”
“రైతుగా మారిన నటుడు.. 40 ఆవులతో పాల వ్యాపారం”
Pooja Hegde | హ్యట్రిక్ ఫ్లాప్‌లలో ఉన్నా తగ్గని పూజా జోరు.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

