నాటు నాటు సాంగ్‌కు చరణ్, తారక్‌తో అదిరిపోయే స్టెప్పులు వేయించింది ఈయనే
Natu Natu Song choreographer Prem Rakshith | టాలీవుడ్లో నటనతో పాటు డ్యాన్స్‌తోనూ అలరించగల స్టార్స్ అంటే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ పేర్లే వినిపిస్తాయి. ఆ జోడు గుర్రాలు ‘నాటు నాటు..’ పాటలోని 97 స్టెప్పుల కోసం 33 రోజులు కష్టపడ్డారనేది నమ్మలేని నిజం. అంతేనా, ఒక్క స్టెప్పులో 53 వేరియేషన్లు ప్రయత్నించారు. వాటిలో ఫైనల్ అయిన స్టెప్పు పర్ఫెక్షన్ కోసం ఏకంగా 17 టేకులు తీసుకున్నారు. ఆ నాటైన స్టెప్పుల రూపకర్త.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.

తమిళనాడులోని పుదుచ్చేరికి చెందిన ప్రేమ్ రక్షిత్ పేదరికంలో పుట్టాడు. అర్ధాకలితో పెరిగాడు. తండ్రి చెన్నై ఫిల్మ్ యూనియన్‌లో సభ్యుడు కావడంతో ఆ సంపాదనే జీవనాధారం. ప్రేమ్‌కు డ్యాన్స్ అంటే ప్రాణం.. పిచ్చి.. మైకం. అప్పటికే కొరియోగ్రఫీలో పేరుగాంచిన ప్రభుదేవా సినిమాలు చూస్తూ ఏకలవ్యుడిలా ప్రాక్టీస్ చేసేవాడు. నేరుగా ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యలేదు. అంతా సొంత విద్యే. ఉన్న కొద్దిపాటి నైపుణ్యంతో చిన్నారులకు డ్యాన్స్ నేర్పేవాడు. తండ్రి చొరవతో యూనియన్‌లో కొరియోగ్రాఫర్‌గా సభ్యత్వమూ వచ్చింది.

పనిలేదు.. డబ్బుల్లేవు. ఒకవైపు తండ్రి వృద్ధాప్యం.. కుటుంబంలో ఆకలికేకలు. కొడుకుగా కుటుంబాన్ని సాదలేక పోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ సమయానికి తమిళ సినీ పరిశ్రమ దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించారు. ఏ కారణం వల్ల అయినా చనిపోతే, కుటుంబానికి నష్ట పరిహారంగా రూ.50 వేలు ఇచ్చేవారు. యూనియన్ నుంచి వచ్చిన ఆ ప్రకటన ప్రేమ్ ఆత్మహత్య ఆలోచనకు మరింత బలాన్ని ఇచ్చింది. తాను చనిపోతే కుటుంబానికి డబ్బు వస్తుందనే ఆశతో.. ఇంట్లో చెప్పకుండానే మెరీనా బీచ్‌వైపు అడుగులు వేశాడు. బీచ్‌కు దగ్గరయ్యాక ఓ అన్నోన్ కాల్.. ‘ప్రేమ్! నేనొక కొత్త సినిమా తీస్తున్నా. నా సినిమాకు కొరియోగ్రఫీ చెయ్యగలవా?’ అంటూ పిలుపు. ఆయనెవరో కాదు ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అధినేత, నిర్మాత ఆర్.బి.చౌదరి. అంతే, ఆత్మహత్య ప్రయత్నాన్ని పక్కకుపెట్టి.. హైదరాబాద్‌కు వచ్చేశాడు ప్రేమ్ రక్షిత్.

కట్ చేస్తే…
‘నాటు నాటు.. నాటు’ పాట దేశవ్యాప్తంగా వైరల్ వీడియోలకే పిచ్చెక్కించింది. దేశమంతా నాటు నాటు.. అంటూ స్టెప్పులేశారు. 3.28 నిమిషాల పాట ఐదు భాషల్లో మొత్తం 20 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డులను తిరగరాసింది. ఆ స్టెప్పులు ఇదివరకెప్పుడూ చూడనివి. థియేటర్లలో అయితే ప్రేక్షకుల పరవశానికి అంతేలేదు. అలా అని ప్రేమ్ రక్షిత్ కొత్త కొరియోగ్రాఫరేం కాదు.. ఇప్పటివరకు 75 సినిమాల్లో 400కు పైగా పాటలకు డ్యాన్స్‌మాస్టర్‌గా వ్యవహరించారు. కొరియోగ్రఫీ కోసం తన దగ్గరికి వచ్చే ప్రతీ పాటకూ.. ఓ కొత్త వేరియేషన్ చూపిస్తాడు. పాటకు తగ్గట్లుగా కొత్తగా స్పెప్పులు డిజైన్ చేయడం ప్రేమ్ రక్షిత్ ప్రత్యేకత.

90వ దశకంనాటి పాటలంటే మొదట గుర్తుకొచ్చేది ప్రేమ్ పేరే. 2002లో తను కొత్త ైస్టెల్ డ్యాన్స్‌ను కొనుగొన్నాడు. అయితే, సమయాభావం వల్ల దాన్ని నలుగురికీ నేర్పే అవకాశం లేకపోయిందని బాధపడుతుంటాడు. ఆ సరికొత్త డ్యాన్స్‌ను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. వినికిడి, మాట లోపం ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం ఓ విజువల్ గ్రాఫిక్స్ కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నాడు ప్రేమ్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తనకు తెలుగు చిత్ర పరిశ్రమ పునర్జన్మను ఇచ్చిందని తరచూ చెబుతుంటాడు.

రాజమౌళి సినిమాలకు..
దర్శకుడు రాజమౌళి వరుసగా ఎనిమిది సినిమాలకూ ప్రేమ్ రక్షిత్నే కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. ఈ యువ కొరియోగ్రాఫర్ రాజమౌళి కంటపడటం వెనుకా ఓ కథ ఉంది. కృష్ణానగర్‌లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని.. సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే.. ఆ సంపాదన సరిపోక పిల్లలకు డ్యాన్స్ నేర్పేవాడు ప్రేమ్. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా ప్రేమ్ శిష్యుడే. అప్పటికే ‘విద్యార్థి’ సినిమాలోని ఓ పాటను రాజమౌళి చూశారు. దీంతో ప్రేమ్‌కు ‘ఛత్రపతి’లో అవకాశం ఇచ్చాడు. నాటి నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే ఉన్నాడు ప్రేమ్.
Read More :
Akkineni Heroes | అక్కినేని హీరోలు రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యేనా..?”
“Jr NTR | ఆ ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లతో రెడీ అంటున్న ఎన్టీఆర్..!”
Acharya OTT | అప్పుడే ఓటీటీలోకి ‘ఆచార్య’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
షూటింగ్లో హీరో గోపీచంద్‌కు ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

