Gopichand Accident | యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది సీటీమార్ సినిమాతో పర్లేదు అనిపించాడు గోపీచంద్. తాజాగా ఈయన తనకు బాగా కలిసొచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ కాంబినేషన్ లోనే వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. ఈ సందర్భంగా షూటింగ్లో పాల్గొన్న గోపీచంద్ స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో గోపీచంద్ కు ఏమైందని ఆరా తీస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ అధికారికంగా ఒక ప్రెస్‌నోట్ విడుదల చేసింది.
While shooting in Mysore, unfortunately our hero @YoursGopichand just fell down due to leg slip. By God’s grace nothing happened to him and he is doing completely fine.
I request fans and friends not to worry about this incident.
– @DirectorSriwass#Gopichand30— VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) April 29, 2022
గోపీచంద్ 30వ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుందని.. అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా గోపీచంద్ కాలు జారి కింద పడిపోయారని తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఆయనకు ఏమీ కాలేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. దయ చేసి ఈ విషయంపై అసత్యపు ప్రచారం చేయవద్దని.. గోపీచంద్ ఆరోగ్యం బాగానే ఉందని వాళ్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని గోపీచంద్.. శ్రీవాస్ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఒకటి రెండు రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత షెడ్యూల్ మళ్లీ మొదలు పెట్టనున్నారు దర్శక నిర్మాతలు.