Acharya OTT | అప్పుడే ఓటీటీలోకి ‘ఆచార్య’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Acharya On OTT | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా విడుదలైన చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.29.52 కోట్ల షేర్‌ను సాధించింది. ఇప్పటికే కొన్ని చోట్ల డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఆచార్య ఓటీటీ ఎంట్రీపై ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఆచార్య సినిమా డిజిటల్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఆచార్య డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ కుదిరించుకున్న డీల్ ప్రకారం సినిమా విడుదలైన మూడు వారాల తర్వాత ఆచార్య డిజిటల్లో విడుదల కావాలి. ఈ క్రమంలో మే చివరి వారంలోపు ఆచార్య డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆచార్య పాత్రలో చిరంజీవి నటించిగా, సిద్ద పాత్రలో రామ్‌చరణ్ నటించాడు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

