Mumbai Cafe Bambai Nazariya | ‘బంబై నజరియా’ కెఫేలో చాయ్ బిస్కెట్ల నుంచి భోజనాల వరకూ రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. ఎల్జీబీటీ సహా క్వీర్ కమ్యూనిటీకి చెందిన ఎంతోమంది ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సాధారణ పౌరులూ వస్తుంటారు. కాలక్షేపానికి చిన్న గ్రంథాలయం కూడా ఉంది. అందులో ఎన్నో సందేశాత్మక పుస్తకాలు ఉంటాయి. గోడల మీద ‘ప్రేమగా ఉండండి.. ప్రేమను పంచండి’ తరహా సందేశాలూ ఆలోచింప జేస్తాయి. ఈ కెఫేను డిగో మిరాండా, గ్లెనిస్ డి అనే ట్రాన్స్జెండర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులంతా ట్రాన్స్జెండర్సే.
పింక్ చాయ్, చీజ్ క్రోసెంట్, చికెన్ పెప్పరోనీ ప్రత్యేక వంటకాలు. పావ్ బాజీ, కీమా పావ్, మిసల్ పావ్ వంటి పక్కా ముంబై రుచులూ లభిస్తాయి. ముంబై నడిగడ్డలో ఓ కెఫే. దానిని ట్రాన్స్జెండర్స్ నిర్వహిస్తున్నా.. అందులో అడుగుపెడితే చాలు, మానవత్వపు పరిమళాల గుబాళింపే. అక్కడ అంతా సమానమే. ఎలాంటి లింగభేదాలు లేవు. ‘బంబై నజరియా’ గురించి ఇప్పుడు ముంబై మాత్రమే కాదు.. దేశం మొత్తం మాట్లాడుకుంటున్నది.
ముంబై ఇండియన్స్ క్రికెటర్లు ఏం మాట్లాడాలన్నా డిసైడ్ చేయాల్సింది మన హైదరాబాదీ అమ్మాయే !!”
“ఐసిస్ దాడిలో రెండు కాళ్లు పోయినా.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు!!”
“Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”