ఐసిస్ దాడిలో రెండు కాళ్లు పోయినా.. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు!!
Kurdish film maker Lisa calan | కుర్దిష్ గౌన్, తలపాగాతో తిరువనంతపురం ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ (ఐఐఎఫ్కే) వేదిక మీద ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారం అందుకున్న లీసా కాలన్ గురించేకాదు, ఆమె కృత్రిమ పాదం గురించీ ప్రపంచానికి పెద్దగా తెలియదు.
‘నేను ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చాను. నా ప్రయాణంలాగే నా కథ కూడా సుదీర్ఘమైందే. మంచి సినిమాలు తీయాలనేది నా ఏకైక లక్ష్యం. కానీ 2015లో ఐసిస్ బాంబు దాడుల్లో నా రెండూ కాళ్లూ పోయాయి. మళ్లీ నిలబడేందుకు కొన్నేండ్ల సమయం పట్టింది. ఇప్పుడు నేను చాలా శక్తిమంతురాలిని’ అంటూ ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ (ఐఐ
ఎఫ్‌కే) వేదిక మీదినుంచీ దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించింది లీసా. తనకు వచ్చిన పురస్కారాన్ని 2015లో టర్కిష్ పట్టణం సురుక్లో జరిగిన ఊచకోత బాధితులకు అంకితం చేసింది. 34 ఏండ్ల లీసా ఆత్మవిశ్వాసాన్ని ఐసిస్ బాంబులు సైతం ఏమీ చేయలేకపోయాయి.

2015లో టర్కీలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కుర్దిష్ పార్టీ అయిన హెచ్‌డీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీపై ఐసిస్ బాంబుదాడులకు పాల్పడింది. ఆ దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన లీసాకు టర్కీ, జర్మనీ దేశాల్లో శస్త్రచికిత్సలు జరిగాయి. అందుకు అవసరమైన డబ్బును స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించారు. అయినా ఆమె నిలబడలేకపోయింది. ఆ వార్త తెలిసి, ఆస్ట్రేలియాకు చెందిన ఒక డాక్టర్ టైటానియంతో చేసిన కృత్రిమ పాదాలను అమర్చారు. దీంతో లీసా తనకు ఇష్టమైన సినిమా రంగానికి తిరిగొచ్చారు. ఆమె సినిమాలు టర్కీ ప్రభుత్వం పడగ నీడన బిక్కుబిక్కుమంటున్న కుర్దుల జీవితాలను కండ్లకు కడతాయి. ఆమె నటి మాత్రమే కాదు, స్క్రిప్ట్ రచయిత, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ కూడా. ఒక దురదృష్టకర సంఘటన ప్రపంచాన్ని, తన చుట్టూ ఉన్న ప్రజలను చూసే దృష్టికోణాన్ని మార్చిందని చెబుతారు లీసా.
Read More :
“Debanji ghosh | భారత ఐటీ రంగానికి ఈమె టార్చ్‌బేరర్”
“ఒక్క అవకాశం ఆ స్త్రీమూర్తులను సిరి మహాలక్షులుగా మార్చేసింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Film maker
- inspiration
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

