కలిపి తీసుకుంటే కష్టమే!
మాంసాహారం, పాలు ఒకేసారి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం మాంసాహారం-పాలను ‘విరుద్ధ ఆహారం’గా పిలుస్తారట. అందుకే, ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
మాంసాహారం, పాలు ఒకేసారి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం మాంసాహారం-పాలను ‘విరుద్ధ ఆహారం’గా పిలుస్తారట. అందుకే, ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణాలు చెబుతూ.. మాంసం వేడిచేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పాలు చలువ చేస్తాయి. కాబట్టి, ఈ రెండూ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. పాలు, మాంసంలో ప్రొటీన్స్, పోషకాలు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి.
కాబట్టి, ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, వికారం లాంటి సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. కొందరిలో గుండెల్లో మంట కూడా వస్తుందట. కాబట్టి, మాంసాహారం తిన్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల విరామం ఇచ్చిన తర్వాతే పాలు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక చేపలు తిన్న తర్వాత పాలు తాగితే.. తీవ్రమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

