ఆదివారం 07 మార్చి 2021
Zindagi - Feb 06, 2021 , 00:36:07

‘ఆయుర్వేద’ స్నానం

‘ఆయుర్వేద’ స్నానం

స్నానానికి సబ్బు ఎందుకు వాడతారు? శరీరం మీది ధూళిని తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుందనే నమ్మకంతోనే కదా! కానీ, సాధారణ సబ్బులు చర్మ సౌందర్యాన్ని పాడుచేయడంతో పాటు రకరకాల సమస్యలను తీసుకొస్తున్నాయి. ఆ రసాయన సబ్బుల స్థానంలో ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు.

  • ఆయుర్వేద సబ్బుల తయారీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగిన పదార్థాలను వాడతారు. అవి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. అలాగే ఈ సబ్బులు పీహెచ్‌ స్థాయిపై ఎలాంటి ప్రభావమూ చూపవు. దాంతో మంట, దురద ఇబ్బంది పెట్టవు.
  • యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలున్న పసుపు, వేప, గంధం, టీ ట్రీ ఆయిల్‌ వంటివి ఈ సబ్బుల్లో ఉపయోగిస్తారు. ఇవి మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి.
  • సాధారణ సబ్బుల్లో ఉండే పారాబెన్స్‌, ట్రైక్లోసన్‌, సల్ఫేట్స్‌ వంటి రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందువల్ల ఎలాంటి రసాయనాలు లేని ఆయుర్వేద సబ్బులు వాడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు వృద్ధాప్య ఛాయల్ని కూడా నివారిస్తాయి.

VIDEOS

logo