సోమవారం 01 మార్చి 2021
Zindagi - Jan 28, 2021 , 00:54:33

ఇరవై నిమిషాలు వదులు బొమ్మాళీ

ఇరవై నిమిషాలు వదులు బొమ్మాళీ

స్మార్ట్‌ఫోన్‌.. నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. కరోనావల్ల చదువులకు కూడా స్మార్ట్‌ఫోనే ఆధారమైంది. ఇక, యువత సంగతి చెప్పేదేముంది? సోషల్‌ మీడియా, సెల్ఫీలు, చాటింగ్‌లు.. ఇలా రోజుకి ఆరు గంటల సేపు నిరంతరాయంగా స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యగల 249 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో తేలిన విషయాలు ఇవీ.. దాదాపు 70 శాతం విద్యార్థులను వెన్నునొప్పి బాధిస్తే, 66 శాతం మంది ముంజేతి నొప్పితో, 57 శాతం మంది మెడ, భుజాల నొప్పులతో బాధ పడుతున్నారట. 23 శాతం యువత విపరీతమైన కండరాల నొప్పులవల్ల రోజువారీ పనులు కూడా చేసుకోలేక పోతున్నట్లు గుర్తించారు. ఫోన్‌ వాడకం తప్పనిసరి అయినప్పుడు.. కనీసం, 20 నిమిషాల విరామం పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.  


VIDEOS

logo