ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Zindagi - Jan 28, 2021 , 00:54:21

ఈస్టోనియా తొలి మహిళా ప్రధాని!

ఈస్టోనియా తొలి మహిళా ప్రధాని!

యూరప్‌ దేశమైన ఈస్టోనియాకు మొదటి మహిళా ప్రధానిగా కాజా కల్లాస్‌ (43) ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పార్టీలతో ఏర్పడిన మిశ్రమ ప్రభుత్వానికి సారథిగా కాజా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకూ అధికారంలో ఉన్న జురీ రాటస్‌ అవినీతి ఆరోపణలతో గద్దె దిగడంతో, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. రిఫామ్‌ పార్టీ తరపున కాజా అధికారాన్ని దక్కించుకున్నారు. ఈమె న్యాయశాస్త్రం చదివారు. 2011లో రాజకీయాల్లోకి ప్రవేశించి, పలు కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్‌ మెంబర్‌గా కూడా పనిచేశారు. ఈస్టోనియా 1991లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటినుంచీ ప్రధానులుగా పురుషులే ఉన్నారు. 


VIDEOS

logo