శనివారం 06 జూన్ 2020
Zindagi - May 19, 2020 , 23:01:40

లాక్‌డౌన్‌... సర్జరీలకు గండం

లాక్‌డౌన్‌... సర్జరీలకు గండం

మొన్నటి వరకూ హాస్పిటల్స్‌ కిటకిటలాడిపోయాయి. డాక్టర్లందరూ బిజీ బిజీ. ఆపరేషన్‌కి పది రోజుల ముందే అపాయింట్‌మెంట్‌ నిర్ధారణ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త జబ్బు వచ్చి పాత జబ్బుల చికిత్సల్ని వాయిదా వేసింది. 

కొవిడ్‌-19 ప్రభావంతో ఆపరేషన్లన్నీ వాయిదా పడ్డాయి. అత్యవసరం అయితే తప్ప డాక్టర్లు సర్జరీలు చేయలేదు. దాంతో ఈ రెండునెలల కాలంలో దేశంలో  5 లక్షలకు పైగా సర్జరీలు, 80 వేలకు పైగా క్యాన్సర్‌, గైనిక్‌ ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. మరికొన్ని రద్దు అయ్యాయి. ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ కన్సార్టియమ్‌ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అసలే జబ్బుతో ఉన్నవాళ్లు.. ఇక కరోనాకు ప్రభావితం అయితే మరింత ప్రమాదం. అందుకే అత్యవసరం కాని కేసులన్నింటినీ వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా మూడు నెలల కాలంలో ఐదు లక్షలకుపైగా.. అత్యవసరం కాని సర్జరీలతో పాటుగా యాభైవేలకుపైగా క్యాన్సర్‌ సర్జరీలు, పాతికవేల ప్రసూతి సంబంధ సర్జరీలు ఆలస్యం అయ్యాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడుకోట్ల సర్జరీలు వాయిదా పడ్డాయని మరో అధ్యయనంలో తేలింది. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం 45 వారాలు పట్టొచ్చని అంటున్నది ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ కన్సార్టియమ్‌. ఇప్పుడు పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. క్యాన్సర్‌ రోగికి ప్రతి రోజూ ముఖ్యమైందే. ఎంత తొందరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. కాబట్టి క్యాన్సర్‌, గుండె సంబంధిత కేసుల ఆపరేషన్లను వెంటనే ప్రారంభించాలని చెప్తున్నారు భారత సర్జన్ల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ పి. రఘురామ్‌. 


logo