e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home యాదాద్రి లాక్‌డౌన్‌ సమయంలో ధైర్యంగా ఉండాలి

లాక్‌డౌన్‌ సమయంలో ధైర్యంగా ఉండాలి

లాక్‌డౌన్‌ సమయంలో ధైర్యంగా ఉండాలి

భువనగిరి అర్బన్‌, మే17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్‌ పాటించాలని, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోని సహృదయ వృద్ధాశ్రమానికి సోమవా రం డీసీపీ సహకారంతో నిత్యావసర సరుకులు, పండ్లు, మా స్కులు, శానిటైజర్లను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.

కరోనా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
ఆత్మకూరు(ఎం): మండలంలోని కొరటికల్‌లో కరోనా బారిన పడిన 25 కుటుంబాలకు సోమవారం ఆత్మకూరు (ఎం) రామ లింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథగౌడ్‌ సహ కారంతో సర్పంచ్‌ కోల సత్తయ్యగౌడ్‌ నిత్యావసర సరుకులను ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ గ్రా మ కార్యదర్శి సైదులు, వార్డు సభ్యుడు అశోక్‌, విద్యార్థి విభా గం మండలాధ్యక్షుడు నాగరాజు, మహేశ్‌ పాల్గొన్నారు.

శానిటైజర్‌ స్టాండ్ల బహూకరణ
ఆత్మకూరు(ఎం), మే 17: మండల టీఆర్‌ఎస్‌ మహిళా విభా గం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ సోమవారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రానికి, గ్రామీణ వికాస బ్యాంక్‌కు శానిటై జర్‌ స్టాండ్లను బహూకరించారు. మండల వైద్యాధికారి ప్రణీష, సీహెచ్‌వో కరుణాకర్‌, సూపర్‌వైజర్‌ సాంబులమ్మ, ఫార్మసిస్ట్‌ మమత, హెల్త్‌ అసిస్టెంట్‌ సైదులు, గ్రామీణ వికాస బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల సేవలు ప్రశంసనీయం
చౌటుప్పల్‌: కరోనా కష్టకాలంలో పోలీసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏసీపీ సత్తయ్య తెలిపారు. మున్సిపాలిటీ కేం ద్రంలో భారత్‌సేవ సహకార ఫోరం ఆధ్వర్యంలో సమకూర్చిన మాస్కులను సోమవారం ఆయన పోలీసు సిబ్బందికి పంపిణీ చేశారు. అదేవిధంగా ఫోరం ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆటోమైకును ప్రా రంభించారు.కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్‌, వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నవీన్‌ బాబు, బొబ్బిళ్ల మురళి, కాయితి రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ
భువనగిరి అర్బన్‌: మండలంలోని వడపర్తి సర్పంచ్‌ ఏ.కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రామ పంచాయతీ, వైద్య సి బ్బందికి మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్‌, గ్లౌజులు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మణెమ్మ, సెక్రటరీ జూబెధర్‌, వార్డుసభ్యులు కవిత, సత్యలక్ష్మి, ధనకోట, ఏఎన్‌ ఎం కిరణ్మయి, ఆశలు లలిత, ఐలమ్మ, రజని పాల్గొన్నారు.

పండ్లు, మాస్కులు పంపిణీ
రామన్నపేట: మండలంలోని లక్ష్మాపురంలో మురారిశెట్టి స త్తయ్య, రాంరెడ్డిలు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు, పం డ్లను సర్పంచ్‌ ప్రకాశ్‌ సోమవారం గ్రామస్తులకు అందజేశారు.

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు సాయం
మోత్కూరు(గుండాల): గుండాల మండలంలో మరిపడిగ గ్రామంలో కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నాన్‌ ఇన్‌స్టూషనల్‌ ఆధ్వర్యంలో నిత్యా వసర సరుకులు అందజేశారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీ డీ కృష్ణవేణి ఆదేశాల మేరకు సోమవారం గ్రామంలో జిల్లా ఇ న్‌చార్జి కవిత సోమయ్య కుటుంబాన్ని పరామర్శించి నిత్యావస ర సరుకులు అందజేశారు. ఎంపీపీ అమరావతి, సర్పంచ్‌ శ్రీని వాస్‌, అంగన్‌వాడీలు ఊర్మిళ, స్వరూప పాల్గొన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వాడల్లో కమిషనర్‌ షేక్‌ మహ మూద్‌ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపాలిటీ శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జంగ నాగరాజు పర్యవేక్షణలో హోం క్వా రంటైన్‌ ఉంటున్న వారి ఇండ్ల పరిసరాల్లో మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో..
గుండాల మండలంలోని బడకొత్తపల్లిలో అనారోగ్యంతో మృ తి చెందిన మొలుగూరి సత్తమ్మ కుటుంబానికి బీర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ బీర్ల అయిలయ్య సహకారంతో రూ.5వేలను అందజేశా రు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ యాదగిరిగౌడ్‌, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్‌ లక్ష్మయ్య, వార్డు సభ్యులు రాములు, రమేశ్‌రెడ్డి, నాయకులు సోమయ్య, సుదర్శన్‌, యాదగిరి, సం దీప్‌, కృష్ణ, పవన్‌, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ
బీబీనగర్‌: కరోనా కష్టకాలంలో పని చేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పంచాయతి సిబ్బంది సేవలు మ రువలేనివని సర్పంచ్‌ మంచాల రవికుమార్‌ అన్నారు. సోమ వారం మండలంలోని రహీంఖాన్‌గూడ గ్రామ పంచాయతీ ఆవరణలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్క ర్లు, అంగన్‌వాడీ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జంగయ్య, వార్డు సభ్యులు పద్మకుమార్‌, రాజేశ్వర్‌, నాగమణి, దుర్గయ్య పాల్గొన్నారు.

ప్రభుత్వ దవాఖానకు ఫ్యాన్‌, మాస్కులు అందజేత
సంస్థాన్‌ నారాయణపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు మండల కాంగ్రెస్‌ నేత ఉప్పల లింగస్వామి సోమ వారం సీలింగ్‌ ఫ్యాన్‌, మాస్కులను మండల వైద్యాధికారి దీప్తి కి అందజేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, యాదయ్య, మాధ వరెడ్డి, జలంధర్‌, శ్రీను, దేవ, లక్ష్మణ్‌, రాజుగౌడ్‌ పాల్గొన్నారు.

సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ
ఆలేరురూరల్‌: మండలంలోని పటేల్‌గూడెంలో సోమవారం సర్పంచ్‌ పద్మ హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చే యించారు. కార్యక్రమంలో కార్యదర్శి సిద్ధులు, వార్డు సభ్యులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ సమయంలో ధైర్యంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement