మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jan 16, 2021 , 02:22:46

పండుగకు ఊరెళితే ఇల్లు గుల్ల

పండుగకు ఊరెళితే ఇల్లు గుల్ల

మోత్కూరు, జనవరి 15: తాళం వేసి ఉన్న మూడు ఇండ్లల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలోని రెండు ఇండ్లలో, అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెంలో ఒక ఇంట్లో జరిగింది. మోత్కూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన గుర్రం రంజిత్‌కుమార్‌, గుర్రం సతీశ్‌లకు చెందిన రెండు వేర్వేరు ఇండ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు.  గ్రామంలో ఇంటి వద్ద ఉంటున్న వారి తల్లి సంక్రాం తి పండుగకోసం ఈ నెల 11న హైదరాబాద్‌కు వెళ్లింది. దుండగులు ఈ నెల 13న ఇంటి ప్రహరీ దూకి ఇంటి ప్రధాన తలుపుల తాళాలను పగులగొట్టి ఇండ్లలోకి ప్రవేశించారు. బీరువాల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రంజిత్‌కుమార్‌ ఇం ట్లో 5తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.5వేల నగదు, 3.5 ఎకరాల కొనుగోలు సేల్‌ డీడీ డాక్యుమెంట్లను, సతీశ్‌ ఇంట్లో 7.5 గ్రాముల చేతి వేళ్ల రింగులు రూ. ఒక వెయ్యి నగదులను దోచుకెళ్లారని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.

బొడ్డుగూడెం గ్రామంలోని  

అడ్డగూడూరు, జనవరి 15: తాళం వేసి ఉన్న ఇం ట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని బొడ్డుగూడెం గ్రామం లో జరిగింది. ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. బొడ్డుగూడెనికి చెందిన సోలిపురం నర్సిరెడ్డి ఈనెల 12న సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమార్తె ఇంటికెళ్లాడు. ఇంట్లో ఎవ రూ లేనిది గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో గమనించిన  ఇరుగుపొరుగు వారు నర్సిరెడ్డికి , పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూసే సరికి బీరువాలో ఉన్న రూ. 10 వేల నగదు, 12 గ్రాము ల బంగారాన్ని అపహరించుకుపోయారు. నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


VIDEOS

logo