ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 13, 2021 , 00:08:13

వివేకానందుడి బోధనలు ఆచరించాలి

వివేకానందుడి బోధనలు ఆచరించాలి

ఆలేరు టౌన్‌, జనవరి 12 :  వివేకానందుడి బోధనలు ఆచరించాలని  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి  అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా    ఆమె మాట్లాడుతూ మన శక్తి, సంపద.. యువశక్తేనని, యువకులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  సంగు భూపతి, చిరిగె శ్రీనివాస్‌, పులిపలుపుల మహేశ్‌, బందెల సుభాశ్‌, చిమ్మి శివమల్లు, సముద్రాల శివ, కోనపురం నాగరాజు, కొన్నె మల్లేశం, జూకంటి ఉప్పలయ్య, గవ్వల నర్సింహులు,  సత్యనారాయణ పాల్గొన్నారు. 

వివేకానందుడి జయంతి

రాజాపేట, జనవరి 12: మండల కేంద్రంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సరస్పతి కళాశాల ప్రిన్సిపాల్‌ సోమసాని సురేందర్‌, అధ్యాపకుడు గుర్రం పాండు, నాయకులు పాల్గొన్నారు. 

యువతకు స్ఫూర్తిదాయకం

తుర్కపల్లి, జనవరి12: స్వామి వివేకానందుడి జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వీరారెడ్డిపల్లి సర్పంచ్‌ జక్కుల శ్రీవాణి వెంకటేశ్‌ అన్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లిలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు భాస్కర్‌యాదవ్‌, ఉప సర్పంచ్‌ మనోహర్‌రెడ్డి, సోషల్‌మీడియా కన్వీనర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

వివేకానందుడికి నివాళి

బొమ్మలరామారం, జనవరి 12:మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఏబీవీపీ మండల కన్వీనర్‌ బేతాళ భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో  స్వామి వివేకానంద  జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై యాదగిరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బండి మహేశ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గూదె బాలనర్సయ్య, ఎంపీటీసీ ఫక్కీర్‌ రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ జూపల్లి భరత్‌, జగ్గర్ల ఆనంద్‌గౌడ్‌, ఎల్లబోయిన రవిశంకర్‌, మల్యాల సర్పంచ్‌ బిట్టు శ్రీనివాస్‌, కృష్ణగౌడ్‌, గణేశ్‌  యాదవ్‌, శాంతాచారి, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో..

ఆత్మకూరు(ఎం), జనవరి 12: స్వామి వివేకానంద జయంతిని మండల కేంద్రంలో శివాజీ యువజన సంఘంతో పాటు అఖిలపక్షం నాయకులు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు మల్లేశంతో పాటు అఖిలపక్షం నాయకులు లక్ష్మారెడ్డి, రాములు, మల్లేశం పాల్గొన్నారు. 

అనంతారంలో..

గుండాల, జనవరి 12: మండలంలోని అనంతారంలో వివేకానంద యూత్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బొంగు శ్రీశైలం, సర్పంచ్‌ తుమ్మ డెన్నీస్‌రెడ్డిలు మాట్లాడారు. ఉపసర్పంచ్‌ కెక్కెర్ల సోమనర్సయ్య, చామల వెంకటరమణారెడ్డి, కాలం రాజు, చామల సంపత్‌రెడ్డి, గొడిశాల వెంకటేశ్‌, నవీన్‌గుప్తా, సంపత్‌, శివారెడ్డి, లక్ష్మీనారాయణ, రాము, రాజు, కనకరాజు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేంద్‌రెడ్డి 

VIDEOS

logo