సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 09, 2021 , 00:31:06

ఎమ్మెల్సీ ఎన్నికలోగెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికలోగెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఆలేరు టౌన్‌, జనవరి 8 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరులో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ యూత్‌, విద్యార్థి విభాగం, పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ పరమేశ్వర్‌, యూత్‌, విద్యార్థి విభాగం నాయకులు భానుచందర్‌, కృష్ణ, కృష్ణ, అర్జున్‌, ప్రసాద్‌, కనకరాజు, నర్సింహులు, రాములు, సంపత్‌, శ్రవణ్‌, బాలస్వామి, భాస్కర్‌ పాల్గొన్నారు.

గంధం ఊరేగింపు..

ఆలేరు పట్టణంలోని రామసముద్రం రోడ్డులో అస్తాన్‌ హజ్రత్‌ బదియోద్దీన్‌ జిం దాషా మదార్‌ సాహెబ్‌ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గంధం ఊరేగింపు కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దర్గా వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకుడు భిక్షమయ్యగౌడ్‌ పూజలు చేశారు. 

VIDEOS

logo