ఘనంగా బాలల దినోత్సవం

భువనగిరి : మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శనివారం మండలంలోని చందుపట్ల అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసందర్భంగా అంగన్వాడీ టీచర్ దంతూరి భాగ్యమ్మ ఆధ్వర్యంలో చిన్నారులచే కేక్ కట్ చేయించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.
భువనగిరిలో..
భువనగిరి క్రైం : గాడ్స్ హర్ట్ ఫర్ ది నేషన్స్, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భువనగిరిలో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాల వెనుక గల గుడిసెల్లో నివసించే పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. అనంతరం కౌన్సిలర్ అవంచిక క్రాంతి పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పిన్నింటి స్టాన్లి, సీఆర్పీసీ స్టేట్ వైస్ ప్రెడిడెంట్ బొక్క రాంబాబు, జిల్లా కన్వీనర్ ఆవుల వినోద్, కాచారాజు జయప్రకాశ్, బాశబోయిన రాజేశ్, దాసరి శ్రీనివాస్, జంపాల అంజయ్య, దాసరి వినోద్ పాల్గొన్నారు.
బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషిచేయాలి
బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం బాలల పరిరక్షణ కమిటీలు కృషి చేయాలని బాలల జిల్లా పరిరక్షణాధికారి పులంగుజ్జు సైదులు కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలరక్షభవన్‌లో బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాంబాయి, మల్లేశ్, వినోద్, భట్టు రామచంద్రయ్య, అంజయ్య, శోభారాణి, స్టాలిన్, మంజుల పాల్గొన్నారు.
పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని అనాథ ఆశ్రమంలోని పిల్లలను ఆదివారం ఆయన కలిసి పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఏసీపీ భుజంగరావు, పట్టణ సీఐ సుధాకర్ పాల్గొన్నారు.
వలిగొండలో
వలిగొండ: భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రతిభ గ్రామర్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర్ల వెంకటేశం నెహ్రూ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, కొండూరి బాలరాజు, రెబ్బ మల్లికార్జున్, తుమ్మల నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమర్, మారగోని విష్ణు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లిలో...
భూదాన్‌పోచంపల్లి: భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పోచంపల్లిలోని శాఖగ్రంథాలయం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సీత భాస్కర్, ఎంఏ షరీఫ్, దోర్నాల శ్రీనివాస్, ఆకులు శోభ పాల్గొన్నారు.
తాజావార్తలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు