మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Nov 12, 2020 , 00:48:17

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ 

అడ్డగూడూరు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ మేకల సుజాత, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు తాడోజు లక్ష్మణాచారి, గ్రామకోఆప్షన్‌ మెంబర్‌ బాల్నె భిక్షం, చిగుళ్ల రమేశ్‌, ఏపీవో వెంకటేశ్వర్లు, ఏఈవో నవనీత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo