సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 17, 2020 , 00:26:38

ప్రజలూ.. జర పైలం

ప్రజలూ.. జర పైలం

అదనపు కలెక్టర్‌  కీమ్యానాయక్‌ 

వలిగొండ : ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ కీమ్యా నాయక్‌ అన్నారు. మండలంలోని సుంకిశాల - వలిగొండ, గోకారం - జాలుకాల్వ గ్రామాల మధ్య రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం జాలుకాల్వ గోకారం గ్రామాల రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తున్న ప్రదేశాన్ని  అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు కల్వర్టు ఏర్పాటు చేయాలని కోరగా,  అదనపు కలెక్టర్‌ ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో మాట్లాడి నూతన కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజ్‌, ఎంపీడీవో గీతారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ రాజశేఖర్‌రెడ్డి, జాలుకాల్వ సర్పంచ్‌ మద్దెల సందీప్‌, తుర్కపల్లి సురేందర్‌, పాలకూర్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo