వైభవంగా శ్రీ సుదర్శన నారసింహ హోమం

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని బాలాలయ మంటపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం వైభవంగా జరిపించారు. బుధవారం నిత్యకల్యాణం నిర్వహించారు.దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును జరిపారు. వేకువ జామున సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శన మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. మంటపంలో స్వామివారికి అష్టోత్తర పూజ, విశ్వక్సేనారాధన జరిపారు. సాయం త్రం ఆలయ మంటపంలో సేవోత్సవం, రాత్రి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు.
శ్రీవారి ఖజానాకు రూ. 83,440 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 83,440 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 470, ప్రసాద విక్రయాలతో రూ. 75,970, వాహనపూజల ద్వారా రూ. 1,900, కొబ్బరికాయలతో రూ. 5,100తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 83,440 సమకూరినట్లు తెలిపారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు