బుధవారం 03 మార్చి 2021
Yadadri - May 27, 2020 , 23:59:23

డీసీసీబీని లాభాల్లోకి తెస్తం..

డీసీసీబీని లాభాల్లోకి తెస్తం..

  • టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌,   డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి 

ఆలేరుటౌన్‌: డీసీసీబీని లాభాల్లోకి తీసుకువస్తానని  టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.  రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. బుధవారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్‌ కార్యాలయంలో కొవిడ్‌-19 మెగా రుణామేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో మొదటిసారి రైతులకు రుణాలు అందజేయడం చాలా సం తోషంగా ఉందన్నారు.  ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని కేసీఆర్‌ కలలను నిజం చేయాలన్నారు. రూ.25,000 లోపు ఉన్న ప్రతి రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసిందన్నారు. జిల్లాలో 4742 మంది రైతులకు మొదటివిడుత రూ.8 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 సొసైటీలకు చెందిన 1373 మంది రైతులకు రూ. 2,26,20,000 రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. ఆలేరు పీఏసీఎస్‌ పరిధిలోని 45 మంది రైతులకు నూతన పంట రుణాలు రూ.35 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 11 సెంటర్లు, 3 సబ్‌ సెంటర్ల ద్వారా రబీలో కందులు 14,948 క్వింటాళ్లు, వరిధాన్యం 51,342 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతంలో రైతుకు  పంటరుణం లక్ష ఇస్తే దానిని  రూ. 3 లక్షలు చేశామన్నారు. డీసీసీబీకి రూ.1000 కోట్ల టర్నోవర్‌ ఉందని, రూ.10 కోట్ల లాభాలు గడిచిందన్నారు. రైతులు అర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం తీసుకువచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమాతో పెద్ద ఎత్తున నూతన వ్యవసాయ విధానానికి రైతులు స్వాగతం పలకాలన్నారు. పంటల వివరాలను వ్యవసాయాధికారులకు తెలియజేయాలన్నారు.  త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగుజలాలు ఆలేరులో నియోజకవర్గంలోని 699 చెరువులు, కుంటలు  నిండనున్నాయన్నారు.  అనంతరం  గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.

VIDEOS

logo