శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Mar 07, 2020 , 23:34:16

నల్లగొండ కలెక్టర్‌ను కలిసిన టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి

నల్లగొండ కలెక్టర్‌ను కలిసిన టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను నల్లగొండలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌) వైస్‌ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట డీఎల్‌డీఏ చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.