e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి

మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే దేవాలయాలకు పూర్వవైభవం
ఆలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు ప్రత్యేక బడ్జెట్‌
శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి, మండలి విప్‌ భానుప్రసాద్‌రావు
కుటుంబసమేతంగా యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు

యాదాద్రి, జూలై31: దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి ఆలయం నిలుస్తుందని శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి, మండలి విప్‌ భానుప్రసాద్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. అతి త్వరలోనే యాదాద్రి ఆలయం దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు పొందుతుందన్నారు. శనివారం వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి కొండపైన గల హరిత హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు.

గత సీమాంధ్ర ప్రభుత్వాల పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆలయాలు సీఎం కేసీఆర్‌తోనే పూర్వవైభవం సంతరించుకుంటున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 99 శాతం ఆ ఆశయాలను సాధిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి, ఆలయ పూజారులకు జీతభత్యాల ను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ దళిత పక్షపాతి అని, వారి అభివృద్ధి కోసమే దళితబంధును ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం, వారికి 24గంటల నాణ్యమైన విద్యుత్‌, రైతుబంధుతో పాటు సాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతి గుంటకూ గోదావరి జలాలను అం దించేందుకు అపర భగీరథ ప్రయత్నం పూర్తయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో సాగునీటి సమస్య ఉండదని అన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని గుర్తు చేశారు.

- Advertisement -

రామలింగేశ్వర ఆలయాభివృద్ధికి కృషి
వలిగొండ, జూలై 31: ప్రొద్దటూర్‌ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామలింగేశ్వరాలయాన్ని శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ సోలిపురం శ్రీకాంత్‌రెడ్డిని అభినందించారు. అనంతరం మాందాపురం గ్రామంలోని స్నేహితుడు సోలిపురం శ్రీకాంత్‌రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి శాసనమండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ను ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గరిసె నర్సమ్మ నర్సిం హ, ఎంపీటీసీ గూడూరు వెంకట్‌రెడ్డి, ఏలే మాణిక్యం,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana