నల్లబెల్లి, ఫిబ్రవరి 17 : కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేయడం అనైతకమని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీత అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. అలాగే, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో నర్సంపేట నియోజకవర్గ రైతాంగానికి సబ్సిడీ పనిముట్ల పంపిణీ కోసం రూ.37 కోట్లు మంజూరైనట్లు గుర్తుచేశారు.
1127 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, రూ. 2,17,37,470 సబ్సిడీతో 1383 పరికరాలు అందించామన్నారు. మండలంలో 74 మంది రైతులకు పరికరాలు అందించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా 2,302 మందికి రైతుబంధు అందలేదన్నారు. అలాగే, ఏప్రిల్‌లో జరిగిన 1748.21 ఎకరాల పంట నష్టానికి బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిన పరిహారం నిధులను కాంగ్రెస్ ఫ్రీజింగ్ చేసిందన్నారు. కన్నారావుపేటలో రూ.180కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ రీసె ర్స్ సెంటర్ పనులను ఇంతవరకూ ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.
మహిళా సాధికారత కోసం సీఎస్ఆర్ ఫండ్‌తో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కేసీఆర్ ప్రభు త్వం రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే.. నేడు కాంగ్రెస్ సర్కారు కనీసం పది గంటలు కూ డా ఇవ్వడం లేదన్నారు. అభివృద్ధి పనులను తక్షణమే అమలు చేయాలని మండల సభ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. సమావేశంలో ఎంపీడీవో నర్సింహమూ ర్తి, వైస్‌ఎంపీపీ గందె శ్రీలత, ఎంపీవో కూచన ప్రకాశ్, వైద్యాధికారి ఆచార్య, ఏవో పరమేశ్వర్, ఏపీవో వెంకటనారాయణ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్ : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మండలవ్యాప్తంగా పేరుకుపోయిన సమస్యలపై ఎంపీటీసీలు అధికారులను ప్రశ్నించారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయిల్ పామ్ తోటలు, మునగ పంటల ఏర్పాటుకు రైతులు ముందుకొచ్చి సబ్సిడీని వినియోగించుకోవాలని ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు కోరారు.
ముత్తోజిపేట, రాజుపేటలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని ఎంపీటీసీలు వీరన్న, సాంబరెడ్డి అన్నారు. కమ్మపల్లిలో మహిళా సంఘం సభ్యుల నుంచి వీవోఏలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎంపీటీసీ వల్గుబెల్లి విజ య తెలిపారు. నర్సంపేట డంపింగ్ యార్డును ఇతర ప్రాంతానికి మార్చాలని ఎంపీటీసీ వీరన్న కోరారు. దా మెర చెరువులో అక్రమంగా మట్టి తొవ్వుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎంపీటీసీ వీరన్న ఆరోపించారు.