దామెర: వేసవికాలంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని జెడ్పీ సీఈవో ఎం. విద్యాలత (Vidyalatha )అధికారులను ఆదేశించారు. మంగళవారం దామెర మండలంలోని ల్యాదెళ్ల, దామెర గ్రామాల్లోని ఓహెచ్ఎస్ ఆర్ వాటర్ ట్యాంకులను జెడ్పీ సీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నిల్వ కోసం ట్యాంకుల కెపాసిటీ, పైపులైన్ల లీకేజీలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
గ్రామాల్లో పాడైపోయిన బోర్ల మరమ్మతులను చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందేవిధంగా గ్రామపంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విమల, ఎంపీఓ రంగాచారి, పంచాయతీ కార్యదర్శులు మనోహర్ రెడ్డి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.