బచ్చన్నపేట, అక్టోబర్ 03 : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో జరిగింది. ఎస్ఐ హమీద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కందుల ఆర్జున్ (16) అతని స్నేహితుడు కృష్ణప్రసాద్ కలిసి ద్విచక్రవాహనంపై పోచన్నపేట గ్రామం నుంచి ఇంటికి వస్తుండగా ఆలేరు నుంచి బచ్చన్నపేటకు వస్తున్న కారు అతి వేగంతో వస్తున్న ద్విచక్ర వాహానాన్ని ఢీ కొట్టడంతో వెనుకాల కూర్చున అర్జున్ కింద ఎగిరి పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం జనగామ ఏరియా దవాఖానాకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అర్జున్ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న కృష్ణప్రసాద్ కి తీవ్ర గాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. కారు డ్రైవర్ కాశిబుగ్గకు చెందిన బొచ్చ క్రాంతికుమార్ అతి వేగం, ఆజాగ్రత్తతో వాహనం నడిపి తన కుమారుడి మృతికి కారణమయ్యారని మృతుడి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.