పోచమ్మమైదాన్, ఆగస్టు 11: ప్రముఖ రచయి త్రి, కవయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు. హనుమకొం డ గోపాల్‌పూర్‌లోని అద్దె ఇంటిలో సోమవారం రా త్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆదివా రం రాత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని చలాకీగా ఉన్న ఆమె ఆకస్మాత్తుగా అస్తమయం కావడంతో ఓరుగల్లు సాహితీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వరంగల్‌లోని అనేక సాహితీ సంస్థలతో ఆమె సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. సా మాజిక అంశాలే ఇతివృత్తంగా ఆమె రాసిన పుస్తకా లు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వివాహం చేసుకోకుండానే పుస్తక రచనతో పాటు సామాజిక సేవకు అంకితమయ్యారు.
తొలి రచన ‘చైతన్యం పడగెత్తింది’తో కవయిత్రిగా ఆమె సాహితీ ప్రస్థానం మొదలైంది. అలా 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా కవిత లు, 30 పాటలు రాసి పాడారు. అంతేగాక ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించి అంశాలపై అనేక రచనలు చేశా రు. పీడిత ప్రజలను చైతన్యం చేసేందుకు సామాజిక స్పృహ కలిగించే ప్తుస్తకాలు రాసి ఇతర రాష్ర్టాల్లోనూ ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తొలి, మలి ఉద్యమంలో కూడా తనదైన ముద్ర వేశారు.
నెల రోజుల క్రితం విశాఖపట్టణంలో ప్రజా సేవకురాలు సీతారామలక్ష్మి మృతిచెందితే అక్కడే ఉండి ప్రత్యేక సంచిక రాసి వచ్చారు. కాగా అనిశెట్టి రజిత మృతిపట్ల శ్రీలేఖ సాహితీ సంస్థ అధ్యక్షుడు డా క్టర్ టీ శ్రీరంగస్వామి లండన్ నుంచి సం తాపం ప్రకటించారు. నేత్ర, శరీరదానంపై పలు ప్రాంతాల్లో ప్ర చారం చేయడమే గాక తాను చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చి వృథా చేయడం కాదు.. వైద్యం వి ద్యార్థులకు ఉపయోగపడాలంటూ పలువురు సాహితీవేత్తల ముందు చెబు తూ గతేడాది కేఎంసీ ప్రిన్సిపాల్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు.
సోమవారం రాత్రి నేత్రవైద్యశాల సిబ్బంది ఆమె నేత్రాలను తీసుకెళ్లారు. కవయిత్రిగా ఎంతో పేరు ఉన్న రజితకు చివ రి ఘడియల్లో కష్టాలు తప్పలేదు. ఆమె మృతదేహా న్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో సాహితీవేత్తలు రెండు, మూడు గంటల పాటు ఇక్కట్లకు గురయ్యారు. అద్దె ఇంటి వారు ఒప్పుకోకపోవడం, బంధువులు నిరాకరించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చివరకు రిటైర్డు ప్రొఫెసర్, కవయిత్రి కాత్యాయని విద్మహే తన ఇంటి ముందు తీసుకురావడానికి అంగీకరించడంతో రాత్రి 10 గంటల దాటిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఫస్టు గేట్ వద్ద ఉన్న కాత్యాయినీ ఇంటి వద్దకు తరలించారు. కాగా, మంగళవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.