మన బడికి సౌర వెలుగులు
‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి.
- ఒక్కో బడిలో 2 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి
- ఎంపిక చేసిన సూళ్లలో దశల వారీగా సోలార్ పలకల అమరిక
- వీటిని గ్రిడ్కూ అనుసంధానం చేయనున్న అధికారులు
- మూడు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు నిర్ణయం
- ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు
సర్కారు బడుల్లో త్వరలో సౌర కాంతులు తళుకులీననున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 35 స్కూళ్లను ఎంపిక చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధన పెరుగడంతో స్కూళ్లకు నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తున్నది. భవిష్యత్తులో పాఠశాలలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు, బిల్లుల మోత లేకుండా చర్యలు చేపట్టింది. తొలివిడుత ఎంపిక చేసిన పాఠశాలల్లో కరంట్ మీటర్లను తొలగించి నెట్ మీటర్లను ఏర్పాటు చేసి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని మూడు స్కూళ్లల్లో ఇన్స్టాలేషన్ పనులు పూర్తవ్వగా, ఈ నెలాఖరులోగా మూడోవంతు పాఠశాలల్లో సోలార్ పరికరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నారు.
– గిర్మాజీపేట, జనవరి 13
గిర్మాజీపేట, జనవరి 13 : ‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి. పాఠశాల ల్లో నెట్ మీటరింగ్ విధానం అమలు చేసి అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకొని మిగతాది గ్రిడ్‌కు అందించే విధంగా సన్నాహాలు జ రుగుతున్నాయి. తెలంగాణ ఇంధనవనరుల అ భివృద్ధి సంస్థ(రెడ్కో), విద్యా శాఖ సంయుక్తం గా వీటిని ఏర్పాటు చేయనున్నాయి. తొలుత రాష్ట్రంలోని 1521 సూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 35 పాఠశాలలను ఎంపిక చేశారు.
ఈ పాఠశాలల్లో కరంట్ మీటర్లను తొలగించి నెట్ మీటర్లను ఏర్పాటు చేసి నేరుగా గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. కనీసం మూడోవం తు పాఠశాలల్లో నెలాఖరులోగా సోలార్ పరికరాలు బిగించాలనే లక్ష్యాన్ని సంబంధిత శాఖ అధికారులు నిర్దేశించుకున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిలోవాట్ విద్యుత్ ఉ త్పత్తికి రూ.50 వేల ఖర్చు కానుంది. సోలార్ పలకల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నేరు గా వినియోగిస్తారు. అలాగే, బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా విద్యుత్‌ను నిల్వ చేసుకొని పాఠశాల అ వసరం మేరకు వినియోగించుకుంటారు. మిగిలిన కరంట్‌ను ‘గ్రిడ్’కు విక్రయించనున్నారు.
విద్యుత్ భారమే అధికం..
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణకు ప్రభుత్వం ఏ టా ఇచ్చే నిధుల్లో సగం విద్యుత్ బిల్లులకే ఖర్చవుతున్నది. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థుల్లోపు ఉన్న స్కూళ్లకు రూ. 25వేలు, 100 మందికిపైగా ఉన్న పాఠశాలలకు రూ.50 వేలు నిర్వహణ ఖర్చులు అందజేస్తున్నది. సూళ్లల్లో డిజిటల్ బోధన పెరుగడంతో కంప్యూటర్లు, ఫ్యాన్ల వినియోగం ఎక్కువవడం, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం కోసం విద్యుత్ మోటర్లూ వాడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కొన్ని స్కూళ్ల బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇక మీదట ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.
ఈ నెలలో మూడో వంతు పూర్తి..
– గంగుల మహేందర్‌రెడ్డి, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్
జిల్లాలో సోలార్ విద్యుత్ సదుపాయం క ల్పించేందుకు తొలి విడుతగా 35 పాఠశాలల ను ఎంపిక చేశాం. డాక్యుమెంటేషన్, సర్వే ప్ర క్రియ కొనసాగుతోంది. పైలెట్ ప్రాజెక్టు పథకం కింద ఇప్పటికే జిల్లాలో మూడు పాఠశాలలో ఇన్స్టాలేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా మూడోవంతు పాఠశాలల్లో సోలార్ పరికరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. ఎంపిక చేసిన పాఠశాలల్లో 2 కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత్ అవసరం అనుకున్న పాఠశాలల హెచ్ఎంలు లిఖితపూర్వకంగా వివరాలు అందిస్తే, అందుకు తగ్గట్లుగా సోలార్ పలకలను అమర్చుతాం.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

