BRS Party | బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆరూరి
BRS Party | బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు నిచ్చారు.
న్యూశాయంపేట : బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ( Aruri Ramesh ) పిలుపు నిచ్చారు. హనుమకొండ హంటర్ రోడ్ లోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని 1, 2 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో పాలకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు మొగ్గ వద్దన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని గడప గడపకు చేర్చాలని సూచించారు. పార్టీ కష్ట కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తు పెట్టు కుంటుందన్నారు. భవిష్యత్తులో వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

