Mahabubabad | గంగారం, జులై 02 : గుడుంబా మహమ్మరికి బలైపోతున్న వారు చాలా మందినే ఉన్నారు. అయినా కూడా గుడుంబా తయారు చేసే వారిలో, దాన్ని తాగే వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మండల పరిధిలోని దుబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడెంలో గుడుంబా ఏరులై పరుతుంది. దీంతో చుట్టూ గ్రామాల నుండి గుడంబా ప్రియులు బారులు తీరి వస్తుంటారు. కాగా దుబ్బగూడెం గ్రామానికి చెందిన పొలబోయిన సుధాకర్ గుడంబాకు బానిసై ఇటీవలే మృతి చెందాడు. ఈ క్రమంలో గ్రామ మహిళలు ఏకమై గుడంబా స్థావరాలపై దాడి చేసి ధ్వసం చేశారు. ఈ గ్రామాల వైపు ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుడంబా ఇష్టానుసారంగా తయారుచేస్తున్నారు. ఎస్ఐ రవికుమార్ గుడంబా కాపుదారులను మందలించిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు గుడంబా నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.