చిల్పూర్ : కాంగ్రెస్ పాలనలో తాగునీటి తెలంగాణలోని పల్లెలు అల్లాడుతున్నాయి. బిందెడు నీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థుతి నెలకొంది. తాజాగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలోని 7 వ వార్డులో తాగునీటి కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామపంచాయతీ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం రోజులుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టింకోవడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకుంటే ఆదోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ గ్రామ కార్యదర్శి పోలు సంపత్. ఇట్టబోయన రమేష్, గద్ద కుమార్, సాదం గణేష్, సాదం రామరాజు, సాదం సాంబరాజు, గిరబోయన వెంకటయ్య, రొయ్యల రవీందర్, బాషాబోయన కవిత, బాషాబోయన రేణుక, సాదం మమత, ఉరడి రేణుక, గద్ద కోమల, సాదం ఐలమ్మ, ఇట్టబోయన శీరీష ఊరడి యాదమ్మ, సాదం అంజమ్మ, గిరబోయన లక్ష్మి. రొయ్యల లింగమ్మ. లావణ్య. తదితరులు పాల్గొన్నారు.