వరంగల్, మార్చి 8 : మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బల్దియా ఆ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బల్దియా, ఓ మెగా బన్ను, రెడ్ క్రాస్ సంస్థలు క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ తీశాయి. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు సాగిన ర్యా లీని మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. కాన్సర్పై అవగాహన కల్పించే ప్లకార్డులను చేత పట్టుకు న్న మహిళలు ఎంజీఎం సర్కిల్లో మానవ హరం నిర్వహించారు. అనంతరం మ్యూజికల్ గార్డెన్లో జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని లింగ సమానత్వం నినాదంతో జరుపుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించి షీ టీం, భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లను ఏర్పాటు చేశారన్నారు. గర్భిణులకు పోషకాహారం కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడం మహిళలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా మహిళల్లో చైత న్యం రావాలన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడు తూ.. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే వా రు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. సమాజ అ భివృద్దిలో స్త్రీ పాత్ర గొప్పదన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల కన్నా బల్దియాలో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉండటం గర్వకారణం అని అన్నా రు. డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండాలన్నారు. డీసీపీ పుష్ప మాట్లాడుతూ.. మహిళలు మగవాళ్లతో సమానంగా రాణిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నయీ కిరణ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎవరైనా మాదక ద్రవ్యాలకు బానిసలైతే సమాచారం అందించాలని కోరారు. అనంతరం మహిళా కార్పొరేటర్లను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన బ్యాంక్ మహిళా ఉద్యోగులను సత్కరించారు. మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, జన్ను షీభారాణి, చీకటి శారద, ఈదురు అరుణ, రావుల కోమల, గుండు చందన, బైరి లక్ష్మి, గుగ్గిళ్ల వసంత, సుంకరి మనీషా, ఆవాల రాధికారెడ్డి, మానస, ఇమ్మడి లోహిత, తూర్పాటి సులోచన, గుంటి రజిత, జక్కుల రజిత, గుగులోత్ దివ్యవాణి, అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, సీహెచ్‌వో సునీత, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.