శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తొలుత ఈ సినిమాను 28వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. సినిమాపై నెలకొనివున్న హైప్ దృష్ట్యా ఒకరోజు ముందుగానే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి నిర్మించారు.
ఈ సినిమాలో జాతకాలు, వాస్తు పిచ్చి ఉన్న యువకుడిగా హీరో శ్రీవిష్ణు కనిపించనున్నారు. ఆయన పాత్ర ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని, వందశాతం వినోదం గ్యారంటీ అని దర్శకుడు తెలిపారు. నయనసారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రథన్, రచన-దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు.