2న ఐవోబీలో సమ్మె
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. యాజమాన్యం విధించిన బలవంతపు నిఘా చర్యలు, కార్యాలయ పద్ధతులకు వ్యతిరేకంగా మార్చి 2న దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. యాజమాన్యం విధించిన బలవంతపు నిఘా చర్యలు, కార్యాలయ పద్ధతులకు వ్యతిరేకంగా మార్చి 2న దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ మెరుపు సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఏఐబీవోసీ) మద్దతు పలికింది.
ఈ పరిణామాలు కార్యాలయ పనితీరులో తీవ్రమైన, ఆందోళనకరమైన మార్పును సూచిస్తున్నదని, అధికారులు బలవంతంగా ఆలస్యంగా రావడం, ఏకపక్షంగా పని ముగింపు ఆంక్షలు, వృత్తిపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే చర్యల వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని అభిప్రాయపడింది. సిబ్బంది నైతికత, మానసిక శ్రేయస్సు, సంస్థాగత పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడే అవకాశాలున్నాయని, దీనిపై యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేకపోవడంతో సమ్మె బాటపట్టినట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
పని గంటల పునరుద్ధరణ, కొన్ని హెచ్ఆర్ నిబంధనలను ఉపసంహరించుకోవడం, పారదర్శక పాలన, తగినంత నియామకాలు చేయకపోవడం, ఏకపక్ష సెలవు నిరాకరణ, జరిమానాలు, ఏకపక్ష విధాన నిర్ణయాలకు ముగింపు పలుకాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

