ధన్వాడ రచ్చబండలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడిన తీరు విడ్డూరం
ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా : పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
కాటారం, మహదేవపూర్‌లో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం
కాటారం/మహదేవపూర్, మే 30: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకుడు భూపెల్లి రాజు తన 50 మంది అనుచ రులతో, మహదేవపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేత మేరుగు శేఖర్ తన అనుచరులతో కలిసి సోమవా రం టీఆర్ఎస్లో చేరారు. వీరికి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ భూపెల్లి రాజు తనకెంతో సన్నిహితుడని, గతంలో చిన్న మనస్తాపం తో కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద తప్పు చేశాడని, వెంట నే గ్రహించి మళ్లీ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.
నియోజకవర్గంలో గతంలో పార్టీ నుంచి వెళ్లిన వారంతా తలెత్తుకొని తిరిగేందుకు మళ్లీ టీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. ఇటీవల ధన్వాడలో నిర్వహించిన రచ్చబండలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందని, ఆ వివరాలు త్వర లో వెల్లడిస్తానని అన్నారు. ఆయన తన సొంత గ్రామంలో ఏం చేసిండో చూపించాలన్నారు. పార్టీ లో చేరిన వారిలో బోడ ఏడుకొండలు, మంతె న సుమన్, సాయి, మహేశ్, శ్రీధర్, రాకేశ్, దామోదర్, భీమయ్య, సందీప్, శ్రీకాంత్, కల్యా ణ్, అజయ్, సిద్ధు, రాజేందర్, శ్రీహరి, రవీందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ తదితరులున్నారు.