నల్లబెల్లి/చెన్నారావుపేట/కాశీబుగ్గ, అక్టోబర్ 30: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లబెల్లిలో మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నది. పత్తినాయక్ తండాతోపాటు ఇతర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వరంగల్ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్కు సుమారు 6 వేల పత్తి బస్తాలు వచ్చాయి. చాలా వరకు తడిసిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.