హనుమకొండ చౌరస్తా, నవంబర్ 15 : గులాబీ జెండాకు ప్రజలు అండగా ఉంటున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో రెండు, మూడు అందుతున్నట్లు వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెకచేయకుండా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రోడ్ల మీద బండ్లు పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి లేకుండా ఇంటిగ్రేటెడ్ మారెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. కేసీఆర్ సుపరిపాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ మారెట్‌తో పాటు వెజ్,నాన్‌వెజ్ మారెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుమార్‌పల్లి మారెట్‌తో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్‌ను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకొని కూమార్పల్లిని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇకడ మా పార్టీ కార్పొరేటర్ లేకున్నా నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అందరూ అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 8వ డివిజన్ ఇన్చార్జి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నలుబోలు సతీశ్, 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి చందర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, బీఆర్ఎస్వీ 8వ డివిజన్ అధ్యక్షుడు నలుబోలు కార్తీక్, కూచన సునీల్, శ్రీధర్ పాల్గొన్నారు.
కాజీపేట : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు మరోసారి ఆశీర్వదించి, గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ బాపూజీనగర్‌లో కొమురెల్లి రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు యూత్‌ల సభ్యులు, రైల్వే రిటైర్డ్ కార్మికులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి చీఫ్‌విప్ కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలోని పథకాలు అమలవుతాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధికి ద మ్ము, ధైర్యం ఉంటే ప్రజల మధ్యలో ఉం డి గెలువాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, డివిజన్ ఇన్చార్జి శిరుమల్ల దశరథం, అధ్యక్షుడు దువ్వ కనకరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, గబ్బెట శ్రీనివాస్, అఫ్జల్, కాటాపురం రాజు, సుంచు కృష్ణ, పాలడుగుల శివకుమార్, మార్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, కొత్త రవి, మనోహర్, నయీంజుబేర్, మైలారం శంకర్, దువ్వ నరేశ్, కాంపెల్లి లక్ష్మణ్, మథిన్, విజయ్‌భాస్కర్, పోగుల శ్రీనివాస్, బొట్టు రాజు, ఇమ్మడి రవి, సునంద్, శ్రీకాంత్, కార్తీక్, పోతుల సాంబయ్య, కొమురవెల్లి శ్రీనివాస్, విజయ్, రాబర్టు, పూర్ణిమ, విజయ, వెంకటేశ్, రాజ్‌కుమార్, దువ్వ యాదగిరి పాల్గొన్నారు.
న్యూశాయంపేట : వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థి చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌కు హనుమకొండలో స్థిరపడిన ఆంధ్రా తాపీ మేస్త్రీలు సంపూర్ణ మద్ద తు తెలిపారు. గ్రేటర్ 49వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళంలో తాము, తమ కుటుంబాలు కారు గుర్తుకే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల మానసారాంప్రసాద్, మేస్త్రీలు బ్రహ్మ య్య, శ్రీనివాస్, సుబ్బరావు, బంగారు, మాలకొండయ్య, మాధవరావు, నాగేందర్, సురేశ్, నాగరాజు, చిన్న పాల్గొన్నారు.