కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు
పార్టీ మోసపూరిత హామీలను నమ్మొద్దని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం నర్సంపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
- నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్
- ‘పెద్ది’ని గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణుల విస్తృత ప్రచారం
నర్సంపేట, నవంబర్ 15: పార్టీ మోసపూరిత హామీలను నమ్మొద్దని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం నర్సంపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, గతంలో చాలాసార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు నిలిపివేస్తామని, 3గంటల కరెంటు చాలు అంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే అంధకారం కావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌తోనే పదేండ్లుగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. కౌన్సిలర్లు దార్ల రమాదేవి, నాగిశెట్టి పద్మప్రసాద్, క్లస్టర్ ఇన్చార్జి డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

ముగ్దుంపురం, ద్వారకపేట, ఇటుకాలపల్లిలో..
నర్సంపేట రూరల్: ముగ్దుంపురంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి, బీఆర్ఎస్ బీసీ సెల్ సంఘం మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, పార్టీ గ్రామ అధ్యక్షుడు చాపర్తి భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్, అర్శనపెల్లి వెంకటేశ్వర్లు, నర్సంపేట పట్టణం ద్వారకపేట 6, 7వ వార్డుల్లో కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు, రామసహాయం సుధాకర్‌రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాయిడి రవీందర్‌రెడ్డి, ఇటుకాలపల్లిలో సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్య వీరన్న, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, పార్టీ గ్రామ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, వినయ్ ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోరుతూ ఇంటింటా ప్రచారం చేశారు. చక్రంతండా, చిన్నగురిజాలలో కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్కే బంజారాల మద్దతు
నల్లబెల్లి: తండాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు లంబాడా గిరిజనులు మండలంలోని అర్వయ్యపల్లితండా సర్పంచ్ మమతా నాయక్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది లక్ష్యంగా మండల ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల ఆదరణ కరువై లంబాడా గిరిజనుల బతుకులు దుర్భరమయ్యాయని, తెలంగాణలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని తెలిపారు. తండాల్లో ఎమ్మెల్యే పెద్ది రోడ్లు, తారు రోడ్ల వేయించారని పేర్కొన్నారు. ప్రచారంలో మండల ఎస్టీ సెల్ నాయకులు గుగులోత్ రామునాయక్, గుగులోత్ సురేందర్‌నాయక్, భూక్య గోలియానాయక్, ఆంగోత్ శ్రీనివాస్‌నాయక్, జాటోత్ రాజ్‌కుమార్, రవి పాల్గొన్నారు.
బుధరావుపేటలో..
ఖానాపురం: ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి గెలుపు కోరుతూ బుధరావుపేటలో పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఖానాపురంలో ఎంపీపీ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఓటరును కలిసి బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరించారు. పెద్దిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

