నల్లబెల్లి, డిసెంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో యూరియా కోసం అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర పత్తి పంట దిగుబడి రాకపోవడంతో దానిని తొలగించి మిరప, మక్కజొన్న, నువ్వులు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రధానంగా మక్కజొన్న, మిరప, వరి పంటలకు అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు ఎరువుల డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో యూరియా బస్తాకు ఎమ్మార్పీ రూ. 265 ఉండగా అధికంగా రూ. 330 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు. దీనికి అదనంగా బయో గుళికలను అంటగడుతూ మరో రూ. 900 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ చేతులు దుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మండల కేం ద్రంలోని ముగ్గురు, నందిగామకు చెందిన ఒక డీల ర్ యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తూ అక్రమ వ్వాపారం చేస్తున్నారని బాధిత రైతులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇఫ్కో, ఆర్సీఎఫ్, క్రిబ్కో తదితర కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే బయో గుళికల లింకును పెడుతున్నారని, దీని కారణంగానే రైతులకు డీలర్లు విక్రయిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృత్రిమ కొరతను అరికట్టి ఎమ్మార్పీ ధరకే యూరియా విక్రయించేలాచర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు.
యూరియా కావాలంటే బయో గుళికలు కొనాల్సిందేనని డీలర్లు అం టున్నారు. దీంతో రూ. 900 అదనంగా నష్టపోతు న్నాం. అంతేగాక యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా దగ్గర యూరియా లేదంటూ బుకాయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి తూతూ మం త్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. గిైట్లెతే యాసంగి పంటలు పండించలేము. మళ్లీ పాతరోజులు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి యురియా కొరతను అరికట్టి డీలర్ల దోపిడీని నియంత్రించాలి.