నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 30 : చేతికొచ్చిన పంటను అమ్ముకునే సమయంలో అకాల వర్షం నిండా ముంచుతోంది. ఆరుగాలం శ్రమిం చి పండించిన వడ్లు కల్లాల్లో తడిసిపోతుండడంతో కాపాడుకునేందుకు రైతన్న పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులు బీభ త్సం సృష్టించగా భూపాలపల్లిలో వడగండ్లు పడి ఆగమాగం చేశాయి.
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు, నెల్లికుదురులో అకాల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో పలు ఇండ్ల రేకులు లేచిపోయి రైలు పట్టాలపై పడ్డాయి. స్థానికులు, రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రేకులను అక్కడి నుంచి తొలగించారు. ము లుగుతో పాటు చుట్టుపక్కల గ్రామా ల్లో ఉరుములు మెరుపులతో కూ డిన వర్షం కురిసింది. భూపాలపల్లి పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం కురిసింది.