కాజీపేట, ఏప్రిల్ 29 : వేసవిలో తిరుమల-తిరుపతి దైవ దర్శనాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతర స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట రైల్వే జంక్షన్- తిరుపతి- కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య మే, జూన్ నెలలో మొత్తం 16 (సర్వీసులు)ట్రిప్పులను నడుపుతున్నామని తెలిపారు. ఈ స్పెషల్ రైళ్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి 07253 నంబర్ గల ట్రైన్ మే నెలలో 06, 13, 20, 27న, జూన్ నెలలో 3,10, 17, 24 తేదీలలో ప్రతి మంగళవారం మద్యాహ్నం 1.30 నిముషాలకు బయలు దేరి తిరుపతికి మరుపతి రోజు బుధవారం ఉదయం 09.00 గంటలకు చేరుతుందన్నారు.
తిరుగు ప్రయాణంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 07254 నంబర్ ట్రైన్ మే నెలలో7, 14, 21, 28న జూన్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో ప్రతి బుధ వారం మధ్యాహ్నం 12.30 నిముషాలకు బయలుదేరి మరుసతి రోజు గురువారం ఉదయం 08.00 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని చెప్పారు.
ఈ-స్పెషల్ రైలు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి బయలు దేరి (వయా) చర్లపల్లి, వికరాబాద్, గుంతకల్, గుత్తి, రాయచూర్, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్ల మీదుగా తిరుపతి రైల్వే స్టేషన్కు నడుస్తుందన్నారు.
ఈ రైళ్లు రాకపోకలలో జనగాం, భువనగిరి, చర్లపల్లి, సనత్ నగర్, లింగంపల్లి, వికరాబాద్, తాండూర్, సెడం, సులెహల్లి (వెస్ట్), యాద్గార్, క్రిష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్డ, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట జంక్షన్లలో నిలుస్తుందని చెప్పారు. ఈ స్పెషల్ రైలుకు మొత్తం 17 బోగీలతో 02 ఎఎసి(డబ్ల్యు), 01 ఎసిసి(ఎన్) 08 సిఎన్ 04 జనరల్ బోగీలు 02 ఎస్ఎమ్ఎర్ బోగీలు ఉంటాయని వివరించారు. స్పెషల్ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ ఉందన్నారు. ఈ సెక్షన్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు ఈ స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.