హనుమకొండ చౌరస్తా : మైనార్టీ ఉద్యోగుల ( Minority Employees ) సమస్యలు, హక్కుల పరిరక్షణ, సమగ్ర అభివృద్ధిపై సంఘటితంగా ముందుకుసాగాలని తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా హనుమకొండ( Hanamkonda ), వరంగల్ ( Warangal ) జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఆదివారం పబ్లిక్‌గార్డెన్‌లో ఎన్నుకున్నారు.
ప్రెసిడెంట్లుగా సయ్యద్ నన్నెసాహెబ్, ముజీబ్ రెహమాన్, జనరల్ సెక్రటరీలుగా ఎండి.జహీర్, ఎండి.మసూద్ అలీ ఎన్నికయ్యారు. ముఖ్యఅతిథులుగా ఐఎన్టీయూసీ ఛైర్మన్ సుదర్శన్‌గౌడ్, ఎంఏ ఆజిజ్, ఫిక్ పాల్గొన్నారు. మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, ప్రమోషన్లు, సంక్షేమ పథకాల అమలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు. మైనార్టీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలవ్వాల్సిన అవసరముందని, ఉద్యోగుల్లో ఐక్యత, అవగాహన పెంపొందించాల్సిన అవసరముందన్నారు.